వరి పంట ఈ క్రాప్ బుకింగ్ పై రైతులు అవగాహన కలిగి ఉండాలి*

 *వరి పంట ఈ క్రాప్ బుకింగ్ పై రైతులు అవగాహన కలిగి ఉండాలి*


 


-  *డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి* 


మనము సాగుచేస్తున్న  పంటను  నమోదు చేసుకోవటం ద్వారా ప్రభుత్వం విపత్తుల సమయంలో మనకు అందించే పంట నష్టం తో పాటు దానిని అమ్ముకునేటప్పుడు కూడా రైతు కు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తెలిపారు.దీనిపై వ్యవసాయ శాఖ అధికారులకు,రైతులకు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత సంవత్సరం కొంతమంది రైతులు పంట నమోదు చేయించుకోకపోవడం వలన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ఇబ్బంది పడ్డారని, దాన్యం డబ్బులు వారి అకౌంట్ లోకి రావటానికి కూడా పలు రకాల సమస్యలు ఎదుర్కొన్నారు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం ప్రతి ఒక సచివాలయం పరిధిలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని, రైతు భరోసా కేంద్రం లో ఉన్న వ్యవసాయ శాఖ అసిస్టెంట్ ద్వారా పంట నమోదు చేయించుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రైతులకు స్పష్టం చేశారు. దీనివలన మొదటిగా మనం ఏ పంట సాగు చేస్తున్నాం అనేది ప్రభుత్వం దగ్గర లెక్క ఉంటుందని, దాని ద్వారా ధాన్యాన్ని రైతుల దగ్గర్నుంచి స్వీకరించేటప్పుడు  ఎంత మొత్తంలో ధాన్యం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నాము..వారికి ఎంత నగదు చెల్లించాలి అనేది ఒక ప్రణాళిక ప్రభుత్వం దగ్గర ఉంటుంది అన్నారు. అంతేకాకుండా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు పంట నష్టం అందజేయడానికి, అలాగే పంట బీమా ను కూడా అందజేయడానికి పంట నమోదు చేసుకున్న వారు అన్ని విధాలుగా అర్హులవుతారు. దీన్నిబట్టి వ్యవసాయం చేస్తున్న రైతులు, కౌలుదార్లు అందరూ కూడా వారు సాగు చేస్తున్న పంటను నమోదు చేయించుకోవాలని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి రైతులకు కు విజ్ఞప్తి చేశారు.

Comments