శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఏకాంతంగా బాలాల‌య కార్యక్రమాలు.


శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఏకాంతంగా బాలాల‌య కార్యక్రమాలు.


        

 తిరుపతి (ప్రజా అమరావతి) : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో బాలాల‌య కార్యక్రమాలు రెండో రోజైన శుక్రవారం ఏకాంతంగా జరిగాయి.


 ఆలయంలోని కల్యాణమండపంలో బాలాల‌యం ఏర్పాటుచేసి స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. యాగశాలలో ఉదయం, సాయంత్రం క్రతువులు ఏకాంతంగా చేపట్టారు.


 ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ప్ర‌త్యేక‌శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ రాజేంద్రుడు, ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ పి.శ్రీ‌నివాస దీక్షితులు, ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు, ఎఈవో శ్రీ ఎం.ర‌వికుమార్‌రెడ్డి, సూప‌రింటెండెంట్ శ్రీ ఎ.నారాయ‌ణ, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ శ్రీ ఎ.కామ‌రాజు పాల్గొన్నారు.

 

Comments