మంత్రి కొడాలి నాని నాయకత్వంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయండి




- మంత్రి కొడాలి నాని నాయకత్వంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయండి 


- వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ పిలుపు 

- క్యాంప్ కార్యాలయంలో రూరల్ నేతలతో సమావేశం 



గుడివాడ, సెప్టెంబర్ 24 (ప్రజా అమరావతి): రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గంలోని రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాలకు ఎన్నికైన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని మంత్రి కొడాలి నాని క్యాంప్ కార్యాలయంలో గుడివాడ రూరల్ మండల నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ సభ్యుల ఎంపిక పై అందరి అభిప్రాయాలను తీసుకున్నారు. ఎంపీపీగా గద్దె పుష్పరాణి, వైఎస్ ఎంపీపీగా బట్టు నాగమల్లేశ్వరి, కో ఆప్షన్ సభ్యుడి చేబ్రోలు సురేష్ ను ఎంపిక చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రకటించారు. అనంతరం దుక్కిపాటి శశిభూషణ్ మాట్లాడుతూ నందివాడ ఎంపీపీగా పెయ్యల ఆదాం, వైస్ ఎంపీపీగా పూడి సుధాకరరావు, కోఆప్షన్ సభ్యుడిగా నున్న చిట్టిబాబు, గుడ్లవల్లేరు ఎంపీపీగా కొడాలి సురేష్, వైస్ ఎంపీపీగా శాయన రవికుమార్, కోఆప్షన్ సభ్యుడిగా రహీంలు ఎంపికయ్యారని తెలిపారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా ఎంపిక ప్రక్రియ జరిగిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పేదప్రజల కోసం అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. వీటిని అర్హులైన పేదలకు అందేలా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే మంత్రి కొడాలి నాని దృష్టికి గాని, క్యాంప్ కార్యాలయం దృష్టికి గాని తీసుకురావాలని దుక్కిపాటి శశిభూషణ్ సూచించారు. అనంతరం గుడివాడ రూరల్ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో ఆప్షన్ సభ్యులుగా ఎంపికైన గద్దె పుష్పరాణి, బట్టు నాగమల్లేశ్వరి, చేబ్రోలు సురేష్ తో పాటు ఎంపీటీసీ సభ్యులను దుక్కిపాటి శశిభూషణ్ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎంపికైన వారిని సభకు పరిచయం చేశారు. అలాగే దుక్కిపాటి శశిభూషణ్ కు పార్టీ నాయకులు పుష్పగుచ్ఛాలను అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ రూరల్ మండలం మోటూరు ఎంపీటీసీ సభ్యురాలు గొర్రె వరలక్ష్మి, చిరిచింతల ఎంపీటీసీ సభ్యురాలు సింగవరపు ఝాన్సీరాణి, శరీగొల్వేపల్లి ఎంపీటీసీ సభ్యురాలు అంగడాల శ్రీరామాంజనేయులు, రామనపూడి ఎంపీటీసీ సభ్యుడు గుంజా వంశీధర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, వ్యవసాయ సలహా మండలి రూరల్ మండల అధ్యక్షుడు మేకల సత్యనారాయణ, వైసీపీ నాయకులు గాదిరెడ్డి రామలింగారెడ్డి, పాలడుగు రాంప్రసాద్, పొట్లూరి మురళీధర్, యార్లగడ్డ సత్యభూషణ్, గిరిబాబాయ్, చిన్ని దుర్గాప్రసాద్, కారే జోసఫ్, రంగా, శాయన నాగబాబు, సూరపనేని కళ్యాణ్, ఖండవల్లి రవి, బోయిన శేఖర్, కళ్ళేపల్లి శంకర్, కలపాల బాబూరావు, గుంజా నారాయణ, గుంజా విజయ్ కుమార్, ఇమ్మడి అశోక్, కారిచెర్ల సుధాకర్, కలతోటి థామస్ తదితరులు పాల్గొన్నారు.

Comments