ఒక మంచి సొంతిల్లు అందరి ఆశ, మరి ఈ ఆశ ను నెరవేర్చే కార్యక్రమమే డబల్ బెడ్ రూమ్ ఇల్లు




మేడ్చల్ (ప్రజా అమరావతి); మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గం లో రసూల్పుర లోని మైసమ్మ కట్ట సిల్వర్ కాంపౌండ్ వద్ద కొత్తగా నిర్మించిన  (double beedroom) ఇండ్లు మంత్రివర్యులు శ్రీ. తలసాని యాదవ్ గారు మరియు హోమ్ శాఖ మంత్రి శ్రీ. మహమూద్ అలీ, ఎమ్మెల్యే శ్రీ. సాయన్నల తో కలిసి సుమారు 166  డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈ సందర్బంగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అందరికి గౌరవంగా ఒక ఇల్లు ఉండేటట్టు ప్రయత్నాలు చేస్తున్నది. ఒక మంచి సొంతిల్లు అందరి ఆశ, మరి ఈ ఆశ ను నెరవేర్చే కార్యక్రమమే డబల్ బెడ్ రూమ్ ఇల్లు


. ఒకప్పుడు రసూల్ పురాలో కేవలం గుడిసెలు ఉండేటివి కానీ ఇక్కడ నివసిస్తున్న పేద ప్రజల మనసులో ఆనందం నింపాలనుకున్నారు ముఖ్యమంత్రి కే. సీ. ఆర్. గారు .... వారికి గౌరవంగా ఉండటానికి మంచి ఇల్లు కట్టించారు.   రాష్ట్రం లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటునము. రైతులకు ఉచిత విద్యుత్తు , బీమా, వృద్దులకు ఆసరా పింఛన్లు, పేద పిల్లల పెళ్లిళ్లకు షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి లాంటి పథకాలు అమలు చేస్తున్నాము. ఇప్పటి వరకు నగరంలో మరియు రాష్ట్రంలో ఎన్నో చోట్లలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించింది రాష్త్ర ప్రభుత్వం. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాలుగ మెరుగైన సేవలందిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణం కొరకు కృషి చేస్తుంది.

ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ తెరాస పార్టీ ఇంచార్జ్ రాజశేఖర్ రెడ్డి, amc చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, కంటోన్మెట్ మాజీ వైస్ ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి, బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments