మంత్రి కొడాలి నాని సమక్షంలో తోడేటి నాని పుట్టినరోజు వేడుకలు
- మంత్రి కొడాలి నాని సమక్షంలో తోడేటి నాని పుట్టినరోజు వేడుకలు


- పుష్పగుచ్ఛంతో సత్కరించిన బీటెక్ విద్యార్థులు

 


గుడివాడ, సెప్టెంబర్ 22 (ప్రజా అమరావతి): పెనమలూరు నియోజకవర్గం గంగూరుకు చెందిన తోడేటి నాని పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర  పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సమక్షంలో ఘనంగా జరిగాయి. బుధవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్ లోని నివాసంలో మంత్రి కొడాలి నానిని తోడేటి నాని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని స్వీట్ తినిపించి తోడేటి నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగూరుకు చెందిన షరీఫ్, పవన్,  చందు, సాయి నిరాజ్, వినోద్,  బసవేశ్వర రావు, కుమార్, ఫణి,  కిరణ్, పామర్రు అశోక్, కలవపాముల పండు, అశ్విన్,  శ్యాంప్రసాద్, జస్వంత్, పండు,  సాయి ధర్మతేజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే విజయవాడకు చెందిన బీటెక్ విద్యార్థులు రవితేజ, సురేష్ లు మంత్రి కొడాలి నానిని కలిశారు. ఈ సందర్భంగా పుష్ప గుచ్చం అందించి మంత్రి కొడాలి నానిని ఘనంగా సత్కరించారు. మంత్రి కొడాలి నాని అంటే తమకు ఎంతో అభిమానమని, ఆయనను కలిసి ఫోటో దిగేందుకు వచ్చినట్టు బీటెక్ విద్యార్థులు రవితేజ, సురేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్ తదితరులు పాల్గొన్నారు.

Popular posts
భారీ గజమాలతో సత్కరించిన అభిమానులు
Image
సంక్షేమ నవశకానికి నాంది నవరత్నాల పథకాలు :
శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ
ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో తీసుకువస్తున్న రిఫార్మ్స్,టెక్నాలజీ వినియోగంలో రాష్ట్రంలోని క్షేత్రస్థాయి అధికారులకు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ట్యాబ్ లను అందజేసిన డి‌జి‌పి గౌతం సవాంగ్ IPS గారు. కార్యక్రమంలో పాల్గొన్న కడప జిల్లా ఎస్పి అన్బురాజన్ IPS .
Image
అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా : ఐ.టీ, పరిశ్రమలు , నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image