కృష్ణాజిల్లా మచిలీపట్నం (ప్రజా అమరావతి);
*సిబ్బంది సంక్షేమానికి కాంక్షించి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ.*
*సంపూర్ణ ఆరోగ్యం వున్నప్పుడే నిబద్ధత గా విధులు నిర్వర్తించగలం.*
*మెగా వైద్య శిబిరాన్ని వినియోగించుకున్న పోలీస్ సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు*.
*వివిధ రకాల వైద్య పరీక్షలు ప్రత్యేకంగా చేయించుకున్న జిల్లా ఎస్పీ*
*మొత్తం ఐదు రకాల వైద్య చికిత్సలు ఉచితంగా నిర్వహించి మందుల పంపిణీ*
_పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బంది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ని, ఏ మాత్రం అనారోగ్య సమస్య ఎదురైనా ఆ భారం కుటుంబంపై పడుతుందని, అందులో భాగంగా సిబ్బంది యొక్క సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజు పోలీసు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించి, అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల విభాగాల డాక్టర్ల క్యాబిన్ లను పరిశీలించి, అక్కడ ఏమి వైద్య పరీక్షలు చేసేది ది ఇతర వివరాలను కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు._
_ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ అహర్నిశలు, అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే దానిని నిర్లక్ష్యం చేసి విధుల్లో నిమగ్నమవుతారు ఉంటారని, అలా నిర్లక్ష్యం చేయడం వలన పెను ప్రమాదానికి కారణాన్ని కొనితెచ్చుకుంటున్నారు అని, అలా కాకుండా వారి ఆరోగ్య స్థితిగతులను గూర్చి అవగాహన చేసుకోవడానికి ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు వినియోగించుకొని, ఏదైనా సందేహం ఉన్నా నేరుగా డాక్టర్లను కలిసి మీ సమస్యను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు._
_అనంతరం మెగా వైద్య శిబిరంలో ఎస్పీ గారు ప్రత్యేకంగా వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకొని, అక్కడికి వచ్చిన పోలీసు సిబ్బందితో సిబ్బంది కుటుంబాల తో మాట్లాడి ఇకపై నిరంతరం ఇలాంటి వైద్య శిభిరాలు నిర్వహించ బడతాయి కనుక నిశ్చింతగా ఉండవచ్చు అని తెలిపారు._
_ఈ కార్యక్రమంలో డాక్టర్లు P. పుష్పిక (డయాబెటీస్), శ్రీ రమ్య (OBG), పవన్ (గ్యాస్ట్రో లజీ), కిరణ్ కుమార్ (చెస్ట్ ఫిజిషియన్), హరీష్ (ఆర్తో) శ్రీనివాస్ (డెంటిస్ట్),అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ విజయవాడ వారిచే పాప్ స్మియర్ టెస్ట్ లు , ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు._
addComments
Post a Comment