ఎపి తదుపరి సిఎస్ గా డా.సమీర్ శర్మ.

 ఎపి తదుపరి సిఎస్ గా డా.సమీర్ శర్మ.


అమరావతి,10 సెప్టెంబర్ (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డా.సమీర్ శర్మను నియమిస్తూ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 1480 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు.ఆయన స్థానంలో  తదుపరి  సిఎస్ గా డా.సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరిస్తారు.ప్రస్తుతం డా.సమీర్ శర్మ రాష్ట్ర ప్రణాళిక మరియు రిసోర్స్ మొబలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు.