*" మరణంలేని మహానేత వై.యస్.ఆర్."*
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి), వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు.*
*వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.*
*రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా రక్తదానం ఇవ్వడానికి భారీగా తరలివచ్చిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రక్త దాతలు.
మరణంలేని మహా నేతగా స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు కీర్తింపబడుతున్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు తీయించిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది.
మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తరువాత వచ్చిన ప్రభుత్వాలు అవరోధాలు సృష్టించాయి.
రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించడంతో పాటు, మరెన్నో సంక్షేమ కార్యక్రమాలను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి, ప్రజలకు అందిస్తున్నారు.
మహానేత రాజశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, వైయస్సార్ అభిమానులకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నా.
మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం నిరంతరం తపన పడుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం అండగా నిలుద్దాం.
మహానేత వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళులర్పిస్తున్నాం.
addComments
Post a Comment