టైక్వాండో బెల్ట్ టెస్ట్ లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు...
టెక్కలి (ప్రజా అమరావతి);
స్థానిక కిషోర్ స్కూల్స్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్-2 నందు టైక్వాండో క్రీడాకారులు జిల్లాలో జరిగిన కలర్ బెల్ట్ టెస్ట్ నందు తమదైన ప్రతిభ కనబరిచారని టైక్వాండో కోచ్ పాండవుల జగదీశ్వర రావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా టౌన్ హాల్ నందు ఈనెల 12వ తారీకు ఆదివారం జరిగిన టైక్వాండో కలర్ బెల్ట్ టెస్ట్ నందు మొత్తం 19 మంది విద్యార్థులు పాల్గొన్నారని అందులో క్రీడాకారుల ప్రతిభను బట్టి 11 మంది ఎల్లో బెల్ట్ గాను, నలుగురు ఎల్లో-1 బెల్ట్ గాను, ముగ్గురు గ్రీన్ బెల్ట్ గాను, 1 బ్లూ బెల్ట్ కైవసం చేసుకుంటారని శిక్షకుడు జగదీశ్వరరావు వెల్లడించారు. ఈ కలర్ బెల్ట్ టెస్ట్ లు శ్రీకాకుళం జిల్లా టైక్వాండో సెక్రెటరీ బి వి వి ఎస్ ప్రసాద్ (టైక్వాండో శ్రీను) ఆధ్వర్యంలో నిర్వహించగా, టెక్కలి చీఫ్ కోచ్ శేఖర్ మాస్టర్ విద్యార్థులను అభినందించారు.
addComments
Post a Comment