నెల్లూరు, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి) : జిల్లాలో ఏర్పాటుచేసిన జగనన్న ఇళ్ల లే అవుట్లలో అన్ని మౌలిక వసతులు
సమకూర్చుకొని ఇళ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతంగా చేపట్టాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నారాయణ భరత్ గుప్త అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గృహ నిర్మాణ సంస్థ అధికారులతో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జగనన్న ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్టీల్, సిమెంటు, ఇసుక కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. లబ్ధిదారులకు బిల్లులను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నామని, ఎక్కడైనా ఆలస్యం జరిగితే లబ్ధిదారులు అధైర్య పడకుండా చూడాలని, తప్పకుండా బిల్లులు మంజూరవుతాయని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఇంటి నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసుకునేందుకు అధికారులు అవగాహన కల్పించి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) శ్రీ విదేహ్ ఖరె, ఓఎస్డి ఎం శివ ప్రసాద్, హౌసింగ్ పీడీ శ్రీ వేణుగోపాల్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ శేషయ్య, నరసింహారావు, అమర్నాథ్ రెడ్డి, హౌసింగ్ డిఇలు పాల్గొన్నారు.
.........
ఉపసంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ నెల్లూరు వారిచే జారీ చేయడమైనది.
addComments
Post a Comment