అప్పీలు కానీ రాకుండా అందరూ అవగాహన కలిగి ఉండాలని

   నెల్లూరు,  సెప్టెంబర్ 8 (ప్రజా అమరావతి):---- భవిష్యత్తులో జిల్లా నుంచి ఒక ఫిర్యాదు గాని,  రెండవ అప్పీలు కానీ రాకుండా అందరూ అవగాహన కలిగి ఉండాలని


రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ శ్రీ రేపాల శ్రీనివాస రావు జిల్లా అధికారులకు సూచించారు. బుధవారం సాయంత్రం నగరంలోని కలెక్టరేట్ శంకరన్    వి. సి.హాల్ లో రాష్ట్ర సమాచార కమిషనర్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ శ్రీ దినేష్ కుమార్ తో కలిసి  జిల్లా శాఖాధిపతుల తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమాచార కమిషనర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వచ్చి 16  సంవత్సరాలు అయిందని,  గత మూడు రోజులుగా జిల్లాలో కమిషన్ తరఫున రెండవ అపీల్ విచారణలు చేపట్టడం  జరిగిందన్నారు. అందులో చాలా  లోటుపాట్లు గమనించామన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ ప్రొఫార్మా బిలో వివరాలు భర్తీ చేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి  నివేదికను  ఉన్నత అధికారులకు పంపాల్సి ఉంటుందన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి (పి ఐ ఓ ), మొదటి అప్పిలేట్ అథారిటీ ఎవరు అనే విషయం తప్పనిసరిగా బోర్డు లో ప్రదర్శించాలన్నారు.    సమాచార హక్కు చట్టంలో పి ఐ ఓ లు కీలకపాత్ర పోషిస్తారన్నారు. పౌరులు సమాచారం కోరితే ప్రతి పిఐ ఒ  సమాచారం ఇవ్వవలసి ఉంటుందన్నారు. మొదటి అప్పిలేట్ అథారిటీకి  ఖ్వాసి జ్యుడీషియల్ అధికారాలు ఉంటాయన్నారు. వారు ఆపిల్దారుని,  పి ఐ ఓను నోటీసు ద్వారా పిలిచి వాస్తవాలు విచారించి తగిన విధంగా ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. మొదటి అప్పిలేట్ అథారిటీ సజావుగా విధులు  నిర్వహిస్తే రాష్ట్ర సమాచార కమిషన్ కు 90 శాతం ఫిర్యాదులు తగ్గుతాయన్నారు. చాలామందికి ప్రభుత్వ శాఖల్లో పి ఐ ఓ , ఏ పిఐఓ ఎవరు అనేది తెలియడం లేదన్నారు.  ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పి ఐ ఓ , ఏ పీ ఓ ఏ పీ ఐ ఓ,  మొదటి అప్పిలేట్ అథారిటీ అనే విషయం నిర్ధారిస్తూ నోటిఫికేషన్ ఇచ్చి కలెక్టర్ కార్యాలయానికి పంపాలన్నారు.  ప్రస్తుతం జిల్లాలో అప్పీళ్ళ  విచారణలో  ఎవరికి  అపరాధ రుసుము వసూలు చేయడం లేదని,  మూడు నెలల తర్వాత  మరల సమీక్షకు వస్తామన్నారు.  జిల్లా నుంచి ఒక్క ఫిర్యాదు గాని రెండవ అప్పీలు గాని ఇకపై రాకుండా చూడవలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. సమాచార హక్కు చట్టం సంబంధించి దరఖాస్తు రాగానే కంగారు పడవలసిన అవసరం లేదన్నారు. కార్యాలయంలో  అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆప్పీల్దారులకు అందజేస్తే సరిపోతుందన్నారు. సమాధానం ఇచ్చేటప్పుడు నిర్ణీత నమూనాలో ఇవ్వాలన్నారు. అది ప్రతి పి ఐ ఓ ప్రొఫార్మాఏ లో సమాచారం  మూడు నెలలకు ఒకసారి జిల్లా అధికారికి పంపించాలని,  మొదటి అప్పిలేట్ అథారిటీ ప్రొఫార్మా బిలో రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపాలని స్పష్టం చేశారు. సెక్షన్ 4(1)(బి) ప్రకారం 17 అంశాలను ప్రతి పబ్లిక్ అథారిటీ వారి అధికారిక వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్ మాట్లాడుతూ సిబ్బంది సరిగా పట్టించుకోక పోవడం వలన ప్రధానంగా అంతరాలు ఏర్పడుతున్నాయన్నారు.  ఆపిల్ దారులకు న్యాయం జరిగేలా వ్యవహరించాలన్నారు.  వక్రమార్గంలో సిబ్బందిని బ్లాక్మెయిల్ చేయడానికి కొన్ని తప్పుడు కేసులు వస్తున్నాయన్నారు. చట్టప్రకారం వాటిని  త్రోసిపుచ్చాలన్నారు. నిజమైన కేసుల పట్ల సరిగ్గా స్పందించి సమాధానం ఇవ్వాలన్నారు.  పౌరునికి ఎలా సమాచారం i ఎలా కొరాలో అనే విషయంపై చైతన్య పరచాల్సిన అవసరం ఉందన్నారు. కార్యాలయంలో పి ఐ ఓ,  ఏపీఐఓ పేర్లు, ఫోన్ నెంబర్లు ప్రదర్శించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు పలువురు శాఖాధిపతులు పాల్గొన్నారు.   

Comments