సోమిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కాకాణి"

 *"సోమిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన కాకాణి"


*



శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (ప్రజా అమరావతి); విలేకర్ల సమావేశంలో ఉపాధిహామీ పనుల బిల్లుల చెల్లింపు విషయంలో సోమిరెడ్డి విమర్శలకు కౌంటర్ ఇచ్చిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి .




 సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డికి, ఆయన కుమారుడికి కప్పం కట్టవలసి రావడంతో పనుల్లో నాణ్యత లోపించింది.


 అధికారులు పరిశీలించిన తర్వాత పనుల నాణ్యత ను బట్టి బిల్లులు చెల్లిస్తారు తప్ప, సోమిరెడ్డి సర్టిఫికెట్ తో కాదు.


 సోమిరెడ్డి హయాంలో "అవినీతి తప్ప, అభివృద్ధి శూన్యం".


 సోమిరెడ్డి ముఖం చూడటానికి అసహ్యం వేసే మాకు, ఛీ.. ఛీ..సోమిరెడ్డి మంజూరు చేసి, నిధులు ఇచ్చి పూర్తి చేసిన పనులకు శిలాఫలకాలు వేస్తామా!.


 సోమిరెడ్డి కాగితాలిచ్చి కమీషన్లు పుచ్చుకొని ఒక రూపాయి నిధులు ఇవ్వకుండా అవినీతికి పాల్పడ్డారు తప్ప, అభివృద్ధి గురించి ఆలోచన చేయలేదు.


 పనులు మంజూరైనప్పుడు  అబ్బా కొడుకులకు అడ్వాన్సులు చెల్లించిన కాంట్రాక్టర్లు, ఫైనల్ బిల్లు వస్తే, కొరవ ముట్ట చెబుతామని సోమిరెడ్డికి షరతు పెట్టారు.


 కాంట్రాక్టర్ల కు ఫైనల్ బిల్లు పూర్తిస్థాయిలో రాకపోతే, తమ కలెక్షన్లు ఆగిపోతాయని ఆందోళన తో ఆవేశపడి సోమిరెడ్డి విమర్శలు గుప్పిస్తున్నాడు.


 సోమిరెడ్డి తన మామూళ్ల కోసం బిల్లులు చేయకపోతే కోర్టుకు వెళ్తానని అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.


 గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారు వెంకటాచలం మండలానికి మంజూరు చేయించిన రూ-అర్బన్ పథకం సోమిరెడ్డి పాలిట కల్పతరువు లా మారింది.


 సోమిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పనులు చేయించకుండానే అధికారులను బెదిరించి, బిల్లులు చేయించుకొని మింగి కూర్చున్నాడు.


 సోమిరెడ్డి హయాంలో రూ-అర్బన్ పథకం అవినీతికి అడ్డా* గా తయారైంది.


 అమాయకులు చేసిన పనులకు తెలుగుదేశం నాయకులతో పర్సంటేజీలు మాట్లాడుకొని వారి పేర్ల మీదనే బిల్లులు చేయమని అధికారులను సోమిరెడ్డి ఒత్తిడిచేయడం దుర్మార్గం.


 రూ- అర్బన్ పథకం అబ్బా, కొడుకులకు కోట్ల రూపాయలు వసూళ్లు చేసుకోవడానికి తప్ప ప్రజలకు ఉపయోగపడలేదు.


 వెంకటాచలం మండలంలో అధికార పార్టీ శాసనసభ్యుని గా 155 సిమెంట్ రోడ్ల కు 28 కోట్ల 18 లక్షల రూపాయలు మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేశాం.


 వెంకటాచలం మండలం లో 29 కోట్ల 90 లక్షల రూపాయలతో అధికార పార్టీ శాసనసభ్యునిగా నిధులు మంజూరు చేసి, సైడు కాలువలు నిర్మించాం.


 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, రెండేళ్ల కాల వ్యవధిలో వెంకటాచలం మండలంలో 58 కోట్ల 8 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మించాం.


 జిల్లాలో అసైన్డ్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించకుండా, పట్టాలు పంపిణీ చేసిన సోమిరెడ్డికి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి.


 రైతుల అనుభవంలో ఉండి, వ్యవసాయం చేసుకుంటున్న భూములకు ఇతరుల పేరుతో పట్టాలు మంజూరు చేసి, వివాదాలు సృష్టించిన ఘనుడు సోమిరెడ్డి.


 గ్రామంలో స్మశాన స్థలాలకు కూడా తెలుగుదేశం నాయకులకు పట్టాలు మంజూరు చేసిన అవినీతి చక్రవర్తి"* గా సోమిరెడ్డి చరిత్రలో మిగిలిపోతాడు.


 సోమిరెడ్డికి కమీషన్లు, కలెక్షన్ల మీద ఉన్న శ్రద్ధ, ప్రజలఅ సంక్షేమం మీద లేకపోవడం దురదృష్టకరం.


సోమిరెడ్డి మంజూరు చేసినట్లు కాగితాలు ఇచ్చి, నిధులు ఇవ్వకుండా పనులు చేయకుండా తాను *వేసిన శిలాఫలకాలు* తానే *ధ్వంసం చేస్తే మంచిది*.


 రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా *నాణ్యత ప్రమాణాలు పాటించి*, పనులు చేసిన వారందరికీ *బిల్లులు* చేయించి నిధులు *విడుదల చేయిస్తాం*.

Comments