శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):   రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి జి.వాణి మోహన్, IAS గారు శ్రీ అమ్మవారి ఆలయము నకు విచ్చేయగా శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేయగా,  కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదములు అందజేశారు. అనంతరం గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ వారు దేవస్థానం నందు జరుగుచున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.