కొవ్వూరు 1, 2 వ వార్డుల కోసం ఉచిత స్పెషాలిటీ మెగా వైద్య శిబిరంకొవ్వూరు  (ప్రజా అమరావతి) ;  


* కొవ్వూరు 1, 2 వ వార్డుల కోసం ఉచిత స్పెషాలిటీ మెగా వైద్య శిబిరం * తాడేపల్లిగూడెం శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఏర్పాటు


* శిబిరంలో 300 మందికి వ్యక్తిగత వైద్య పరీక్షలు చేసిన డా. తానేటి శ్రీనివాస్ 


..... మంత్రి తానేటి వనిత


గత వారం రోజులుగా జ్వరాలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రజలకు భరోసా ఇవ్వడమే కాకుండా స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరిపినట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


శుక్రవారం సాయంత్రం స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, 1వ, 2వ  వార్డుల లో వైరల్ జ్వరాల బారిన పడిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. ఈ జ్వర లక్షణాలు తీవ్ర జ్వరం, ఒళ్ళు నొప్పులు, వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఇప్పటికే వార్డు లో 4 రోజులు గా  ప్రత్యేక వైద్య శిబిరం నిరహిస్తున్నామన్నారు. ఉదయం వార్డులో తిరిగి ప్రజలకు మనోధైర్యం ఇచ్చామని మంత్రి తెలిపారు. డా.శ్రీనివాస్ బాధితులను పరిశీలించి వ్యాధి లక్షణాలు తెలుసుకుని మందులు రాయడమే కాకుండా ఉచితంగా మందులను అందచేయ్యడం జరిగిందని తానేటి వనిత తెలిపారు.  ఈవార్డు త్రాగునీటి కాలుష్యం లేదని రిపోర్ట్ వొచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో ఇంటి సామగ్రి, నిర్మాణ మెటీరియల్ ఇంటి ముందే ఉంచడం వల్ల మురుగు కాల్వల శుభ్ర పరచడంలో మునిసిపల్ సిబ్బంది  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే కాలువలు శుభ్రపరచడం, బ్లీచింగ్ వెయ్యడం, పరిశుభ్రమైన త్రాగునీరు క్లోరినైజేషన్ చెస్తున్నామని పేర్కొన్నారు. తాను వైరల్ జ్వరాల విషయం గురించి చెప్పగానే, ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చినందుకు ప్రజలు తరపున కృతజ్ఞతలు తేలుపుతున్నట్లు పేర్కొన్నారు.


ఈ వైద్య శిబిరంలో డా. తానేటి శ్రీనివాస్  మాట్లాడుతూ, సుమారు 300 మందికి వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. జ్వరం, కాళ్ళ నొప్పులు, వాపులు , పిల్లల లో ర్యాషెస్ తదితర సమస్యలతో వొచ్చారని తెలిపారు. ఈ లక్షణాలు వైరల్ జ్వర లక్షణం అని పేర్కొన్నారు.  ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం తోపాటు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ముఖ్య మన్నారు. మురుగునీరు నిల్వ ఉండకుండా పారుదల వ్యవస్థ నిర్వహించాలన్నారు. ఎటువంటి వర్ధ్యాలను రోడ్లపై పడవెయ్యే రాదన్నారు. తేలికగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం ముఖ్య మన్నారు. మంత్రి వెంట కొవ్వురు ఛైర్ పర్సన్ బావన రత్నకుమారి,  డిప్యూటీ డి. ఎం. హెచ్ ఓ, పి. రామగురు రెడ్డి, మునిసిపల్ కమీషనర్, టి.రవి కుమార్, వైద్య నిపు ణులు, ఎస్. ధర్మరాజు,బి. శ్రీనివాస్,మునిసిపల్ వైస్ ఛైర్పర్షన్స్, మన్నె పద్మ, జి. అం జలీ దేవి, కౌన్సిలర్ లు,  బి. సత్య నారాయణ అక్షయ పాత్ర శ్రీనివాస్ రవీంద్ర, కె. రమేష్, స్థానిక ప్రజాప్ర తినిధులు, తదితరు లు పాల్గొ న్నారు.