నెల్లూరు (ప్రజా అమరావతి);
జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు
నిరక్షరాస్యులైన వయోవృద్ధులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి సచివాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం పరిధిలో నిరక్షరాస్యులను గుర్తించి ప్రతిరోజు సాయంత్రం వేళల్లో వారికి విద్యను బోధించి అక్షరాస్యులుగా మార్చాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడమే లక్ష్యంగా సచివాలయ సిబ్బంది పనిచేయాలని, ప్రతి శుక్ర,శనివారాలు ప్రజల వద్దకు వెళ్లి పథకాలను వివరించి వారి సమస్యలను తెలుసుకోవాలని వాలంటీర్లకు సూచించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డిఓ శీనా నాయక్, సచివాలయ సిబ్బంది మధు, అశోక్ , వాలంటీర్లు పాల్గొన్నారు
addComments
Post a Comment