14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీల నిర్ణయం పై ప్రజల అభిప్రాయాలకు

 గుంటూరు (ప్రజా అమరావతి); నగరంలో 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీల నిర్ణయం పై ప్రజల అభిప్రాయాలకు


అనుగుణంగా నిబంధనల మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటామని,ఇందుకై ఏర్పాటు చేసిన కమిటీ సమగ్రంగా అధ్యయనం చేస్తుందని,14% ఓపెన్ స్పేస్ చార్జీల నిర్ణయం పై ఇప్పటికే 13 మంది వివిధ విభాగాల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని,కమిటీ మొదటి  విడత సమావేశం కూడా అయ్యిందని తెలిపారు.యల్.టి.పి ల సూచనల మేరకు వారి సంఘం నుండి మరో ఇద్దరు ప్రతినిధులను సదరు కమిటీలో చేరుస్తామని,ఈ కమిటీ రాష్ట్రంలోని ఇతర నగరాల్లో నిర్ణయమైన 14% ఓపెన్ స్పేస్ చార్జీస్ అమలును మరియు నగరంలో ఆర్.యస్.ఆర్/టి.యస్.ఆర్ ప్రకారం ఉన్న గృహాల టి.యస్ నంబర్స్ గుర్తించడం, తదితర అంశాలను అధ్యయనం చేసి,నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని, యల్.టి.పి లు అప్లికేషన్లు ఆన్ లైన్ అప్ లోడ్ చేసే సమయంలోనే అన్ని డాకుమెంట్స్ అప్ లోడ్ చేయాలన్నారు.ప్రభుత్వ నిర్ణయానుసారం,ఓపెన్ స్పేస్ చార్జీల పై కమిటీ సమగ్రంగా చర్చించి ఇచ్చిన నివేదిక ప్రకారం నిర్ణయం జరుగుతుందన్నారు.నగరంలో టి.యస్ నెంబర్లు,రెండువందల గజాల లోపు ఉన్న స్థలాలకు 14% ఓపెన్ స్పేస్ చార్జీల నుండి మినహాయింపు ఇవ్వాలన్న యల్.టి.పి ల ప్రతిపాదనలు కూడా పరిశీలించాలని కమిటీకి సూచించామని నగర మేయర్ తెలిపారు.#గుంటూరు_నగర_మేయర్_కావటి_శివ_నాగ_మనోహర్_నాయుడు,కమిషనర్ చల్లా అనురాధ,CP హిమబిందు,ఇతర అధికారులు,LTP  లు పాల్గొన్నారు.Dt