వచ్చే నవంబర్ 15 తేదీ నాటికి 165 ప్రాంతాల్లో బల్క్ పాల శీతలీకరణ కేంద్రాలను సిద్ధం చేయాలని

    నెల్లూరు,  అక్టోబర్ 1 (ప్రజా అమరావతి):---- జిల్లాలో వచ్చే నవంబర్ 15 తేదీ నాటికి 165 ప్రాంతాల్లో బల్క్ పాల శీతలీకరణ కేంద్రాలను సిద్ధం చేయాలని


జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి ఎన్ చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.  శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ సంయుక్త కలెక్టర్ శ్రీ హరెందిర ప్రసాద్, అభివృద్ధి సంయుక్త కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్ లతో  కలసి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో అముల్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు  అధికారులు అంతా సంసిద్ధం కావాలన్నారు.  ఇందులో భాగంగా జిల్లాలో మొదటి దశలో   165 ప్రాంతాల్లో బల్క్ పాలశీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సమాయత్తం కావాలన్నారు.   నాలుగు చోట్ల పది రోజుల్లోగా యంత్ర సామాగ్రిని తెప్పించిఅన్ని ఏర్పాట్లతో ప్రారంభించేందుకు సన్నద్ధం కావాలన్నారు.  ఇందుకోసం ముందుగాపాల కేంద్రాలు నెలకొల్పే గ్రామాల జాబితాను సంబంధిత ఎంపీడీఓలకు పంపించాలన్నారు.  పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించి పాల సేకరణ కేంద్రాలకు పాలు పోసే విధంగా  చైతన్య  పరచాలన్నారు. గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి పాలు పోసే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలన్నారు. పాడి పశువుల ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు ఉపాధి హామీ మీ డి ఆర్ డి ఎ శాఖలకు లక్ష్యాలు నిర్దేశించారు దేశి అన్నారు ఇతర జిల్లాల కంటే జిల్లా లో అమూల్ ప్రాజెక్టు అమలు ముందంజలో ఉండాలన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు               శ్రీ బి మహేశ్వరుడు,  డి ఆర్ డి ఎ,  డ్వామా పి డి లు శ్రీ సాంబశివా రెడ్డి, శ్రీ తిరుపతయ్య, డి సి ఓ శ్రీ తిరుపాల్రెడ్డి,  పంచాయతీ రాజ్ ఎస్ ఈ శ్రీ సుబ్రహ్మణ్యం,  పశుసంవర్ధక శాఖ డి డి శ్రీ సోమయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.