జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదం.టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు.

        

 తిరుమల (ప్రజా అమరావతి):

    టిటిడి ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు శ్రీ వై.వి.సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న గురువారం తిరుమల అన్నమయ్య భవనంలో నూత‌న బోర్డు తొలి స‌మావేశం జరిగింది.


ఈ ధర్మకర్తల మండలి స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ వివ‌రాలు ఇలా ఉన్నాయి….


 జమ్మూలో శ్రీ వేంకటేశ్వర ఆలయ నిర్మాణానికి రూ.17.40 కోట్లతో టెండర్లకు ఆమోదం. చెన్నై, బెంగళూరు, ముంబైలో టిటిడి సమాచార కేంద్రాలు మరియు శ్రీవారి ఆలయాల స్థానిక సలహా మండళ్లకు ఛైర్మన్ల నియామకానికి ఆమోదం.


◆చెన్నై – శ్రీ ఎ.జె.శేఖర్ రెడ్డి

◆బెంగళూరు- శ్రీ రమేష్‌ శెట్టి

◆ముంబై – శ్రీ అమోల్‌ కాలే


 అలిపిరి కాలిబాట సుందరీకరణ పనులకు రూ.7.50 కోట్లతో టెండర్లకు ఆమోదం.


 వైఎస్‌ఆర్‌ జిల్లా రాయచోటిలో టిటిడి కల్యాణమండపం నిర్మాణానికి రూ.2.21 కోట్లతో టెండర్లకు ఆమోదం.


 టిటిడి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించేందుకు ఆప్‌కాస్‌ తరహాలో టిటిడి కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం.


 టిటిడి ఉద్యోగుల హెల్త్‌ ఫండ్‌కు ఆమోదం.


 తిరుమలలోని వరాహస్వామి విశ్రాంతి భవనం`2లో పలు ప్రత్యేక అభివృద్ధి పనులు మరియు మరమ్మతులు చేపట్టేందుకు రూ.2.61 కోట్లతో టెండర్లకు ఆమోదం.


 స్విమ్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలోని సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌ రీసెర్చి భవనంలో అదనంగా 4, 5 అంతస్తుల నిర్మాణానికి రూ.4.46 కోట్లతో టెండర్లకు ఆమోదం.


       ★ టిటిడి ఈవో డాక్ట‌ర్ జ‌వ‌హ‌ర్‌రెడ్డి, 

బోర్డు స‌భ్యులు:

● శ్రీ అశోక్ కుమార్‌,

● శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి,

● శ్రీ రాంభూపాల్ రెడ్డి, 

● శ్రీ జీవ‌న్ రెడ్డి,

● డా.చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి,

● శ్రీ‌మ‌తి మ‌ల్లీశ్వ‌రి,

● శ్రీ మారుతి ప్ర‌సాద్,

● శ్రీ రామేశ్వ‌ర రావు, 

● శ్రీ నంద‌కుమార్‌,

● శ్రీ క్రిష్ణారావు, 

● శ్రీ విద్యాసాగ‌ర్‌రావు, 

● శ్రీ ల‌క్ష్మీనారాయ‌ణ‌,

● శ్రీ మొరంశెట్టి రాములు,

● డా.శంక‌ర్, 

● శ్రీ విశ్వ‌నాధ్, 

● శ్రీ మిలింద్ నర్వేకర్, 

● శ్రీ బోర సౌరబ్‌, 

● డా.కెతన్ దేశాయ్‌,

● శ్రీ స‌న‌త్‌కుమార్‌,

● శ్రీ సంజీవ‌య్య‌, 

● వ‌ర్చువ‌ల్‌గా శ్రీ శ్రీ‌నివాస‌న్‌,

● రాజేష్ శ‌ర్మ పాల్గొన్నారు.


 అదేవిధంగా అద‌న‌పు ఈవో 

● శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి,

● జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, 

● శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య‌,

●  సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి లు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

 

Comments