పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకుల నియామకానికి దరఖాస్తుల గడువు ఈనెల 24 వరకూ పొడిగింపు.
అమరావతి,9 అక్టోబరు (ప్రజా అమరావతి): రాష్ట్ర పశుసంవర్థక శాఖలో పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుండి ఈనెల 10వతేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ గతంలో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ అమరేంద్ర కుమార్ తెలియజేశారు.కాగా పరిపాలనా పరమైన కారణాల వల్ల ఆగడువును మరో రెండు వారాల పాటు అనగా ఈనెల 24 వరకూ పొడిగించినట్టు ఆయన తెలిపారు.కావున పశువైద్య సహాయ శస్త్ర చికిత్సకుల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈ మార్పును గమనించి ఈనెల 24 వ తేదీ సాయంత్రం 5గం.లోగా లోగా వారి దరఖాస్తులను విజయవాడ లోని పశుసంవర్థక శాఖ సంచాలకులు వారి కార్యాలయానికి సమర్పించాల్సిందిగా అమరేంద్ర కుమార్ తెలియజేశారు.
addComments
Post a Comment