పుంగనూరు (ప్రజా అమరావతి);
*గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తన సుదీర్ఘ ప్రజా సంకల్ప పాదయాత్ర లో అక్క చెల్లెమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందుల ను చూసి చలించి పోయి మహిళల ఉజ్జ్వల భవిష్యత్ కోసం 2019 ఏప్రిల్ 11 వ తేదీ నాటికి పొదుపు సంఘాల బ్యాంక్ రుణాల అప్పు నిల్వ మొత్తం సొమ్ము ను నాలుగు విడత లు గా నేరుగా వారి సంఘం పొదుపు ఖాతాలకు జమ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది.. ఇందుకు వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా అమలు చేస్తున్న నవరత్నాలు లో చేర్చడం జరిగింది..*
*వై ఎస్ ఆర్ ఆసరా*
*రెండవ విడత కార్యక్రమం ఈ నెల 7 నుండి 17 వతేది వరకు ఆసరా ఉత్స వాలు కార్యక్రమంలో భాగంగా జిల్లా స్థాయి కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం పుంగ నూరు శుభారాo ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో నిర్వహించారు.. ఈ కార్యక్రమంనకు ముఖ్య అతిధులు గా గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.నారా యణస్వామి,గౌ.రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విచ్చేశారు...*
*ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు గౌ. చిత్తూరు ఎంపీ ఎన్.రెడ్డప్ప,జిల్లా కలెక్టర్ యం.హరి నారాయణన్, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు,గౌ.పీలేరు,తంబల్లపల్లి,పలమనేరు,చిత్తూరు, శ్రీకాళహస్తి, సత్య వేడు,పూతల పట్టు,మదనపల్లి శాసన సభ్యులు చింతల రామ చంద్రా రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి,వెంకటేగౌడ్,ఆరణిశ్రీనివాసులు,బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆదిమూలం,ఎం.ఎస్.బాబు,నవాజ్ భాష, గౌ.రాష్ట్ర జాన పద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండ వీటి నాగ భూషణం, గౌ.పుంగనూరు, కుప్పం,మదనపల్లి నగర అభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, ఎన్ఆర్ఈజీ ఎస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఎం. విశ్వనాథం,డి సి సి బి చైర్ పర్సన్ రెడ్డమ్మ, జిల్లా జాయింట్ కలె క్టర్ (సంక్షేమo) రాజ శేఖర్, పుంగనూరు మునిసిపల్ చైర్మన్ ఆలీమ్ భాష, డి ఆర్ డి ఎ,మెప్మా పీడీ లు తులసి,రాధమ్మ, డిపి ఓ దశరథ రామి రెడ్డి,జడ్పీ సీఈ ఓ ప్రభాకర్ రెడ్డి, పుంగ నూరు మునిసిపల్ కమీషనర్ కె.ఎల్. వర్మ,తహసీల్దార్ వెంకట రత్నo,ఇతర సంబంధింత అధి కారులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు...*
*ఈ కార్యక్రమంలో భాగంగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కు సంబంధించి 69 వాహనాలను ముఖ్య అతిథులు ప్రారంభిం చి.
.అనంతరం మెప్మా, డి ఆర్ డి ఏ, ఐ సి డి ఎస్ వారు ఏర్పాటుచేసిన స్టాల్స్ పరిశీలించారు... సభా వేదిక కు చేరుకున్న అనంతరం జ్యోతి ప్రజ్వలన తో కార్యక్రమ ప్రారంభం కాగా..దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజ శేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రులు పాలాభి షేకం చేశారు..*
*తదుపరి సభను ఉద్దేశించి జిల్లా కలె క్టర్,రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, రాష్ట్ర పంచా యతీరాజ్ గ్రామీణాభి వృద్ధి శాఖ మాత్యులు ప్రసంగించారు..*
*ఈ కార్యక్రమంలో భాగంగా మెప్మా పరిధిలోని 8 మున్సి పాలిటీలకు సంబం ధించి ఆసరా రెండవ విడత కింద మొత్తం 10,639 స్వయం సహాయక సంఘాలకు రూ.103.45 కోట్ల మెగా చెక్కు ను, స్త్రీ నిధి కింద 61,561 స్వయం సహాయక సంఘాలకు రూ.211,17,00, 000/- మెగా చెక్కు ను,డిఆర్ డి ఎ ద్వారా ఆసరా రెండవ విడత కింద 557958 స్వయం సహాయక సంఘాలకు రూ.582.185 కోట్ల మెగా చెక్కు ను, 12,894 స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజ్ క్రింద రూ.1050,10,00, 000/- ల మెగా చెక్కు ను ముఖ్య అతిథులు చేతుల మీదుగా అందజేశారు.*
*ఈ కార్యక్రమం తదు పరి పుంగనూరు పాత బస్తాండ్ వద్ద గల దివంగత మహానేత డా.వై.ఎస్.రాజ శేఖర్ రెడ్డి గారి విగ్రహం నకు గౌ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,గౌ. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పూల మాల వేసి నివాళులర్పిం చారు...*
*అనంతరం పుంగనూరు పాత బస్ స్టాండ్ వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారి జన్మదినం (11-10-21) ను పురస్కరించుకొని ముందస్తుగా అభిమానులు మంత్రి చే కేక్ కట్ చేయించారు..*
*తదనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సుగుటూరు గంగమ్మ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి అమ్మ వారిని దర్శించు కొని తీర్థప్రసాదాలు స్వీకరించారు...*
*పుంగనూరు కొత్తపేట నందు మసీదు నిర్మాణానికి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు భూమి పూజ చేశారు*
*పుంగనూరు టు మదనపల్లి రోడ్డు లో రవాణా శాఖ- మోటార్ వాహన తనిఖీ అధికారి యూనిట్ కార్యాలయం ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు ప్రారంభించారు..*
*ఈ కార్యక్రమాలలో మంత్రుల వెంట చిత్తూరు ఎంపీ ఎన్. రెడ్డప్ప, జెడ్పి చైర్మన్ గోవిందప్ప శ్రీని వాసులు,పలమనేరు, చిత్తూరు,సత్య వేడు,శ్రీకాళహస్తి శాసన సభ్యులు వెంకటే గౌడ్,ఆరణి శ్రీనివాసులు,ఆదిమూలం,బియ్యపు మధుసూదన్ రెడ్డి, పుంగనూరు, కుప్పం, మదనపల్లి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ వెంకట్ రెడ్డి యాదవ్, రాష్ట్ర జానపద కళల అభివృద్ధి సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం,డిటిసి బసిరెడ్డి,తిరుపతి ఆర్ టి ఓ సీతారామిరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ అలీo భాష, జడ్పిటిసి జ్ఞానప్రసూన, నాయ కులు పెద్దిరెడ్డి, సంబం ధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు*
addComments
Post a Comment