నవంబరు 7లోగా తెలంగాణాకు బదిలీ కోరే ఉద్యోగులు శాఖాధిపతులకు ఆప్షన్స్ ఇవ్వాలి

 నవంబరు 7లోగా తెలంగాణాకు బదిలీ కోరే ఉద్యోగులు శాఖాధిపతులకు ఆప్షన్స్ ఇవ్వాలి

అమరావతి,7 అక్టోబరు (ప్రజా అమరావతి):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కొంతమంది తెలంగాణా స్థానికత కలిగి ఉండడం,తమ భాగస్వాములు తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తుండడం  వంటి కారణాలతో తమను తెలంగాణా రాష్ట్రానికి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేయడం జరిగింది.దానిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వారిని తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసేందుకు వీలుగా అలాంటి ఉద్యోగుల నుండి నవంబరు 7వతేదీ లోగా ఆప్షన్ ఫార్మ్స్ సేకరించాలని  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సర్కులర్ ఆదేశాలు జారీ చేశారని రాష్ట్ర సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభుషణ్ కుమార్ తెలియజేశారు.ఈ ఉత్తర్వుల ప్రకారం తెలంగాణా రాష్ట్రానికి బదిలీపై వెళ్లాలనుకునే ఉద్యోగులు నవంబర్ 7వ తేదీ లోపు ప్రభుత్వం సూచించిన ప్రొఫార్మాకు అనుగుణంగా సంబంధిత శాఖాధిపతులకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలియజేశారు.

కావున ఆయా శాఖాధిపతులు తెలంగాణాకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగుల ధరఖాస్తులను పూర్తిగా పరిశీలించి వాటిని సర్టిఫై చేసి ధరఖాస్తు అందిన 10 రోజుల్లోగా సంబంధిత శాఖల కార్యదర్శులకు సమర్పించాల్సిందిగా ముఖ్య కార్యదర్శి శశిభుషణ్ కుమార్ తెలియజేశారు.ఆ విధంగా శాఖాధిపతుల నుండి అందిన ఆప్షేన్ ధరఖాస్తులను వారం రోజుల్లోగా జిఏ(ఎస్పిఎఫ్ అండ్ ఎంసి)వారికి సమర్పించాల్సిందిగా ముఖ్య కార్యదర్శి శశిభుషణ్ కుమార్ తెలియజేశారు.

      

Comments