కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో అక్టోబర్ 8 నుంచి 17 వరకు వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంకొవ్వూరు (ప్రజా అమరావతి);


కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో అక్టోబర్ 8 నుంచి 17 వరకు  వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమంపాల్గొననున్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గ స్థాయిలో అక్టోబర్ 8 నుంచి 17 వరకు నిర్వహించడం జరుగుతుందని  రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 8వ తేదీ అన్నదేవరపేట, గజ్జరం, తాడిపూడి, తాళ్లపూడి లో నిర్వహించే కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు. 9 వ తేదీ తిరుగుడుమెట్ట, పెద్దేవం (రావురూపాడు), వేగేశ్వరం, మలకపల్లి లలోను, 10వ తేదీ బ్రహ్మణగూడెం, చాగల్లు, మార్కొండాపాడు, 11వ తేదీన మల్లవరం, ఉనగట్ల లో, 12వ తేదీ చిక్కాల, కలవలపల్లి, 13 వ తేదీ కొవ్వూరు, నందమూరులో, 16 వ తారీఖున కుమారదేవరం, మద్దూరులంక, మద్దూరు, వాడపల్లి, తోగుమ్మి, వేములూరు, పసివేదల లో, 17 వ తేదీ ఐ. పంగిడి, కాపవరం, ధర్మవరం, దొమ్మేరు, పెనకన మెట్ట గ్రామాల్లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్న ట్లు పేర్కొన్నారు. ఆయా మండలాలు పరిధిలో జరిగే కార్యక్రమాలలో మంత్రి తానేటి వనిత ముఖ్య అతిధిగా హాజరవ్వడం జరుగుతుంది.