కొవ్వూరు (ప్రజా అమరావతి);
కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి గా ఎస్. మల్లిబాబు శుక్రవారం ఉదయం భాద్యత లను స్వీకరించారు.
శుక్రవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్న ఎస్. మల్లిబాబు కి కార్యాలయ పరిపాలనా ధికారి జి. ఎస్. ఎస్.జవహర్ బాజీ, ఇతర సిబ్బంది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎస్
మల్లిబాబు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. డివిజన్ స్థాయిలో అందరిని కలుపుకుని వెళతానని, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు అమలు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఆర్డీవో గా పనిచేస్తూ, కొవ్వూరుకి బదిలీపై రావడం జరిగిందని పేర్కొన్నారు.
addComments
Post a Comment