సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళంగోళ్ల రంగారావు మృతి సాహిత్య రంగానికి తీరనీలోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.

 


ఏలూరు  (ప్రజా అమరావతి);



ఇటీవలే మృతి చెందిన సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళంగోళ్ల రంగారావు మృతి సాహిత్య రంగానికి తీరనీలోటని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.



శుక్రవారం ఏలూరులో ని ఆయన స్వగృహంలో పిళ్ళంగోళ్ళ రంగారావు చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా  నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, సాహిత్య రంగానికి రంగారావు గారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు సాహిత్య రంగానికి కూడా తీరని లోటన్నారు. ఈ సందర్భంగా  ఆయన కుమార్తె పిళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి ని, కుటుంబీకులను కలసి విచారం వ్యక్తం చేశారు. శ్రీలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగఢ సానుభూతిని తెలిపి,  పరామర్శించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.




Comments