*2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు*
*" వేంకటాచల మహత్యం,"*
*వాహనసేవల వైశిష్ట్యంపై ఉపన్యాసం*
*వసంత మండపం నుండి ప్రత్యక్షప్రసారం*
తిరుమల (ప్రజా అమరావతి):
తిరుమల వసంత మండపంలో బ్రహ్మోత్సవాల రోజుల్లో .....
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు వేంకటాచల మహత్యం,
వాహనసేవల వైశిష్ట్యంపై ఉపన్యాస కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డా. ఆకెళ్ల విభీషణశర్మ ఉపన్యసిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వేంకటాచల మహత్యం ఉపన్యాసం తరువాత ఉదయం, రాత్రి జరిగే వాహనసేవల వైశిష్టాన్ని తెలియజేస్తున్నారు. చివరగా వేంకటాచల మహత్యంలోని స్తోత్రాలను 12 మంది వేదపండితులు పారాయణం చేస్తున్నారు.
మూడోరోజైన శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డా. ఆకెళ్ల విభీషణశర్మ వేంకటాచల మహత్యంపై ఉపన్యసిస్తూ బ్రహ్మోత్సవాల ఆవిర్భావం గురించి తెలియజేశారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారు వెలిసిన శేషాచల కొండ నాలుగు యుగాల్లోనూ ఉందని, కలియుగంలో దాని మహిమ గొప్పదని చెప్పారు. పూర్వయుగాల్లో ఇది తపో భూమి అని,
◆ కృతయుగంలో ధర్మదేవత తపస్సు చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందిందని,
◆ త్రేతాయుగంలో అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయస్వామివారిని పుత్రునిగా పొందారని,
◆ ద్వాపర యుగంలో శేషుడు తపస్సు చేయగా శేషాద్రిగా పిలవబడుతోందని వివరించారు.
◆ కలియుగంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి పుట్టలో తపస్సు చేసి ఆ ఫలాన్ని భక్తులకు అందించారని తెలిపారు.
తొండమాన్ చక్రవర్తి అశేషమైన భక్తి ప్రపత్తులతో శ్రీవారికి ఆలయం కట్టించారని,
స్వామివారి ఆజ్ఞ మేరకు చతుర్ముఖ బ్రహ్మ ఉత్సవాలు జరిపించారని,
కావున బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని వివరించారు.
addComments
Post a Comment