నవంబరు 14న తిరుపతిలో 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
• కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం
• ఆంద్రప్రదేశ్,తెలంగాణా సహా 8దక్షిణాది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, సియంలు,లెప్నెంట్ గవర్నర్లు,సిఎస్ లు,అడ్మినిస్ట్రేటర్లు సలహాదారులు హాజరు
• జోనల్ కౌన్సిల్ సమావేశానికి పట్టిష్టమైన ఏర్పాట్లు చేయండి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ
అమరావతి,28 అక్టోబరు (ప్రజా అమరావతి):నవంబరు 14న తిరుపతిలో జరుగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వివిధ శాఖల కార్యదర్శులను,చిత్తూరు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.ఈజోనల్ కౌన్సిల్ సమావేశ ఏర్పాట్లపై గురువారం అమరావతి సచివాలయం మొదటి బ్లాకు సియం సమావేశ మందిరంలో ఆయన వివిధ శాఖల కార్యదర్శులతోను,వీడియో లింక్ ద్వారా టిటిడి ఇఓ,చిత్తూరు జిల్లా కలక్టర్,ఎస్పి తదితర అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ వివిధ శాఖలపరంగా తీసుకోవాల్సిన చర్యలు చేయాల్సిన ఏర్పాట్లపై తగిన సూచనలు ఆదేశాలు జారీ చేశారు.ఏర్పాట్ల విషయంలో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.చేయాల్సిన ఏర్పాట్లపై ఒక చెక్ లిస్ట్ రూపొందించి ఆప్రకారం సకాలంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.
కేంద్ర హోంశాఖమంత్రి ఆమిత్ షా అధ్యక్షతన జరగనున్న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో8రాష్ట్రాలు/కేంద్రపాలితప్రాంతాలు అనగా ఆంధ్రప్రదేశ్,తెలంగాణా,కర్నాటక,కేరళ, తమిళనాడు,పుదుచ్చేరి రాష్ట్రాలు సభ్యులుగాను,అండమాన్ నికోబార్ దీవులు,లక్షద్వీవులు ప్రత్యేకఆహ్వానితులుగాఈసమావేశంలోపాల్గొంటాయి.ఆయారాష్ట్రాలగవర్నర్లు,ముఖ్య మంత్రులు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,సలహాదారులు,ఇతర సీనియర్ అధికారులు,ఆయా కేంద్రపాలిత ప్రాంతాల లెప్నెంట్ గవర్నర్లు,అడ్మినిస్ట్రేటర్లు తదితరలు ఈసమావేశంలో పాల్గొంటారు.ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయంతో పాటు వివిధ అంశాల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు.
ఈజోనల్ కౌన్సిల్ సమావేశానికి శాఖల వారీగా తీసుకోవాల్సిన చర్యలను ఆయా శాఖల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు.ముందుగా ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ ప్రోటోకాల్ ఏర్పాట్ల గురించి వివరించారు.అలాగే సమాచారశాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈజోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనే ప్రతినిధుల సందేశాలకు సంబంధించిన పొటోలు,వీడియో క్లిప్లింగులు, ప్రత్రికా ప్రకటనలు మీడియాకు విడుదల చేసే అంశాలను వివరించారు.అదే విధంగా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఇతర ఏర్పాట్లు గురించి సిఎస్ కు వివరించారు.అలాగే ఐటిశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి సమావేశానికి వీడిఓ కాన్పరెన్సింగ్ ఏర్పాటు విధానం,ఎల్ఇడి స్క్రీన్ లు, వైపై, హైస్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యాలు వంటివి కల్పించే అంశాలను వివరించారు.టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ పలు వాహనాలు సమకూర్చడంతోపాటు వివిధ రహదారులను మెరుగుపర్చడం వంటి చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు.అదనపు డిజిపి రవిశంకర్ మాట్లాడుతూ ప్రముఖులందరికీ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు, సమావేశానికి వచ్చే వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంకా వైద్య ఆరోగ్య,రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులు వారి వారి శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలను వివరించారు.అలాగే తిరుపతి నుండి వీడియో లింక్ ద్వారా పాల్గొన్న టిటిడి ఇఓ డా.కెఎస్.జవహర్ రెడ్డి,చిత్తూరు జిల్లా కలక్టర్,ఎస్పి,తిరుపతి మున్సిపల్ కమీషనర్లు జోనల్ కౌన్సిల్ సమావేశానికి చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు.
అనంతరం జోనల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి చర్చించాల్సిన,కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాల్సిన వివిధ అజెండా అంశాలపై వివిధ శాఖల కార్యదర్శులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ప్రత్యేకంగా సమీక్షించారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య,ఎక్స్ అఫీషియో ముఖ్యకార్యదర్శి (స్టేట్ రీఆర్గనైజేషన్) ఎల్ ప్రేమ చంద్రారెడ్డి,వైద్య ఆరోగ్య,రెవెన్యూశాఖల ముఖ్య కార్యదర్శులు అనిల్ కుమార్ సింఘాల్,వి.ఉషారాణి,జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామల రావు,అసెంబ్లీ కార్యదర్శి పి.బాలకృష్ణ మాచార్యులు తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment