క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన తమిళనాడు ఎంపీలు.

 

అమరావతి (ప్రజా అమరావతి);


క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ను కలిసిన తమిళనాడు ఎంపీలు.సీఎంను కలిసిన వారిలో తమిళనాడు రాష్ట్రం ఉత్తర చెన్నై లోక్‌సభ సభ్యుడు డాక్టర్‌ కళానిథి వీరాస్వామి, రాజ్యసభ సభ్యుడు టి ఎస్‌ కె ఇళం గోవన్‌లు.


నీట్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్‌ రాసిన లేఖను ఏపీ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు అందించిన తమిళనాడు ఎంపీలు.


నీట్‌ అడ్మిషన్‌ విధానం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల హక్కులను హరిస్తోందని సీఎం స్టాలిన్‌  ఆ లేఖలో పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పి నడుపుకొంటున్న మెడికల్‌ కాలేజీల అడ్మిషన్‌ల విధానంలో కేంద్రం చొరబాటును వ్యతిరేకిస్తున్నామని, దీనికోసమే భాజపాయేతర రాష్ట్రాల సీఎంలకు తమ నాయకుడు, తమిళనాడు సీఎం లేఖ రాసినట్లు తమిళనాడు ఎంపీలు ఏపీ సీఎం శ్రీ వైయస్‌.జగన్‌కు వివరించారు.

Comments