జగన్మాత ఆశీస్సులతో .. .. రాష్ట్రం, ప్రజలు అందరూ సుఖ:శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలనికొవ్వూరు (ప్రజా అమరావతి);జగన్మాత ఆశీస్సులతో .. ..  రాష్ట్రం, ప్రజలు అందరూ సుఖ:శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని


, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత అనుగ్రహం ఉండాలని  రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరం పార్లమెంటరీ సభ్యులు మార్గాన్ని భరత్ రామ్ పేర్కొన్నారు.కొవ్వూరు నియోజకవర్గ పరిధిలో విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి  డాక్టర్ తానేటి వనిత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా  కార్యక్రమాలు చాగల్లు గ్రామంలో కనక దుర్గ గుడిలో జరిగే పూజ    కార్యక్రమంలో పాల్గొన్నారు.  అనంతరం పసివేదల గ్రామంలో షిరిడీ సాయి గుడిలో జరిగే పూజ  కార్యక్రమంలో,   పెద్దేవం గ్రామంలో విజయ సాయి మందిరంలో జరిగే ప్రత్యేక పూజ  కార్యక్రమంలో,  తాళ్లపూడి గ్రామంలో శ్రీ కనక దుర్గ గుడిలో జరిగే రథోత్సవం  కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని పూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.  కొవ్వూరు ప్రెస్ క్లబ్ లో  దుర్గ పూజ  కార్యక్రమంలో  రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ తో కలసి పాల్గొన్నారు. కొవ్వూరు ప్రెస్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లా స్వామి నాయుడు ఆధ్వర్యంలో  మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మంత్రి తానేటి వనిత, పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్ రామ్ పాల్గొన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నవరత్నాలు పథకాలతో రాష్ట్రంలోని  అన్ని వర్గాల ప్రజలకు ఇంటివద్దనే సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.  అనంతరం మంత్రిని, ఎంపీని ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు గంధం పూజ నరసింహ బాపూజీ , వీరంశెట్టి రాజా వరప్రసాద్,  గౌరవ అధ్యక్షులు జి వి సత్యనారాయణ , కార్యదర్శి ప్రకాష్ , ఉపాధ్యక్షులు పుప్పాల  సురేష్,  సభ్యులు బోనగిరి  అయ్యప్ప,  పొన్నాడ సుబ్రహ్మణ్యం,  నాదెళ్ల రాము ,  శ్రీహరి, త్రినాథ్, దాసు , భాను,  గరగ వరప్రసాద్, రవి,  ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.