శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి): ప్మురముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు  కుటుంబసభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయంనకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి కుటుంబం శ్రీ అమ్మవారిని దర్శించుకుని, శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరం ఆలయ వేదపండితులు వీరికి వేదస్వస్తితో  ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  మరియు కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ 


శ్రీ అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు వీరికి అందజేశారు. అనంతరం కార్యనిర్వహణాధికారి వారు వీరికి శ్రీ మల్లేశ్వర స్వామి వారి దర్శనం కల్పించారు..