శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):   మైసూరులోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమ  ఉత్తరపీఠాధిపతి శ్రీ  దత్త విజయానంద తీర్థ స్వామీజీ  శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయంనకు విచ్చేయగా  దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్  మరియు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామీజీ  శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకున్నారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం మంత్రివర్యులు మరియు కార్యనిర్వహణాధికారి  శ్రీ అమ్మవారి  ప్రసాదములు స్వామీజీ వారికి అందజేశారు. అనంతరం  స్వామిజివారు  అనుగ్రహభాషణము చేశారు.