కొవ్వూరు (ప్రజా అమరావతి);
వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ ఆసరా పధకం ..
దసరా కానుకగా స్వయం సహాయక సంఘ మహిళల ఖాతాలో జమ..
ది.7.10.21 నుండి 17.10.21 వరకు మహిళ ల పొదుపు ఖాతాలకు జమ
కొవ్వూరు డివిజన్ పరిధిలో వైఎస్సార్ ఆసరా పధకం ద్వారా స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెమ్మ లకు పంపిణీ కార్యక్రమం లో భాగంగా ది.7.10.21 నుండి 17.10.21 వ తేదీలలో పొదుపు ఖాతాలలోకి జామచేయడం జరు గుతోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్సార్ ఆసరా కార్యక్రమం ద్వారా కొవ్వూరు నియోజ కవర్గం లో రెండో విడత లో 4219 స్వయం సహాయక సంఘ సభ్యుల కు రూ.36.53 కోట్ల ను, నిడదవోలు నియోజకవర్గం లో 4815 గ్రూపులకు రూ.46.32 కోట్లు, తణుకు నియోజకవర్గం లో 4972 గ్రూపులకు రూ.47.37 కోట్లు, ఆచంట నియోజకవర్గం లో 4877 గ్రూపు లకు 49.19 కోట్ల రూపాయ లు, గోపాలపురం నియోజకవర్గం లో 6074 గ్రూపు లకు 57.07 కోట్ల రూపాయలు పొదుపు ఖాతా ల్లోకి జమ చేయడం జరుగుతోంది. గత ఏడాది తొలి విడతగా లబ్దిదారుల ఖాతాలకు సెప్టెంబర్11న వై ఎస్సార్ ఆసరా లబ్దిని జమచెయ్యడం జరిగింది..
addComments
Post a Comment