సమంత – నాగ చైతన్య విడాకులు..!



*సమంత – నాగ చైతన్య విడాకులు..!*



టాలీవుడ్ స్టార్ కపుల్ అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.


 అయితే విడాకులపై ఇంత రచ్చ జరుగుతున్నా చైతూ గానీ, సమంత గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. 


మరో వైపు వారి విడాకుల వ్యవహారం ప్రస్తుతం కౌన్సిలింగ్ స్టేజ్ లో ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.


ఈ నేపథ్యంలోనే… హీరో నాగ చైతన్య..తమ వివాహ బంధంపై సంచలన ట్వీట్ చేశాడు. 


సమంత, తాను విడాకులు తీసుకోబోతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు నాగచైతన్య.


 సమంత నేను విడిపోతున్నామని.. సమంతతో పదేళ్ళ స్నేహానికి ముగింపు చెబుతున్నట్లు పేర్కొన్నాడు నాగ చైతన్య. 


క్లిష్ట పరిస్థితుల్లో తన వెంట ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 


అంతే కాదు అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాడు నాగచైతన్య. 


అటు సమంత కూడా ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది.

Comments