సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కు ధరఖాస్తులు ఆహ్వానం

 సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ కు ధరఖాస్తులు ఆహ్వానం

అమరావతి,12 అక్టోబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పిఎన్ స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ విజయవాడ,రాయలసీమ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైబ్ర్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ గాంధీనగర్, కడప,వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్ అరండల్ పేట గుంటూరుల్లో తెలుగు,ఆంగ్ల మాద్యమంలో 40 సీట్లు వంతున మొత్తం మూడు సంస్థల్లోను 120 తెలుగు,120 ఆంగ్లం సీట్లతో ఐదు మాసాల కాలవ్యవధితో కూడిన సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ (C.L.I.Sc.) కోర్సులో చేరేందుకు అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర పౌర గ్రంధాలయాలశాఖ సంచాలకులు ఎస్కె.పీర్ అహ్మద్ తెలియజేశారు.ఈకోర్సునకు సంబంధించి పై పేర్కొన్న సంస్థల్లో డిశంబరు 1వ తేదీ నుండి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకూ శిక్షణ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈశిక్షణా కోర్సులో చేరగోరే అభ్యర్ధులు తప్పనిసరిగా రెండేళ్ళ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలని లేకుంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ద్వారా తత్సమాన విద్యార్హతను కలిగి ఉండాల్సి ఉంటుందని సంచాలకులు పీర్ అహ్మద్  స్పష్టం చేశారు.ఈశిక్షణా కోర్సుకు అభ్యర్ధుల ఎంపికను పూర్తిగా వారు పొందిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగు తుందని తెలిపారు.అదే విధంగా డిగ్రీ ఉత్తీర్ణులైన వారికి 5మార్కులు,పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన వారికి 10 మార్కులు వంతున అనదనంగా వెయిటేజ్ మార్కులు ఇచ్చి ఎంపిక చేయడం జరుగు తుందని పేర్కొన్నారు.ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు చదివిన విద్యార్ధులు ఈశిక్షణా కోర్సులో చేరేందుకు అర్హులు కాదని ఆయన స్పష్టం చేశారు.

ఈకోర్సులో చేరబోయే అభ్యర్ధులకు 1987 విద్యాశాఖ ప్రభుత్వ ఉత్తర్వుల సంఖ్య 140 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడం జరుగుతుందని సంచాలకులు పీర్ అహ్మద్ స్పష్టం చేశారు.ఆప్రకారం 33 1/3శాతం సీట్లు మహిళలకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.అలాగే రెండు మాద్యమాల్లోను 10శాతం వంతున సీట్లను జిల్లా గ్రంధాలయ సంస్థలు, ప్రభుత్వ లైబ్రరీలు మరియు పౌర గ్రంధాలయాల సంస్థ సంచాలకులు వారి కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కేటాయిండచం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సర్టిఫికెట్ కోర్సు ఇన్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్ (C.L.I.Sc.,) కోర్సులో చేరేందుకు అవసరమైన ధరఖాస్తులను పై పేర్కొన్న మూడు కళాశాల్లోను నవంబరు 1వతేదీ నుండి నవంబరు 15వతేదీ వరకూ విక్రయిస్తారని రాష్ట్రా పౌర గ్రంధాలయాల సంస్థ సంచాలకులు ఎస్.కె.పీర్ అహ్మద్ తెలియజేశారు.ఆయా సంస్థల ప్రిన్సిపాల్ పేరిటన తీసిన రెండు రూపాయల పోస్టల్ ఆర్డర్ ను ఇచ్చి ధరఖాస్తులు పొందవచ్చని తెలిపారు.పూర్తి చేసిన ధరఖాస్తులను నవంబరు 18వతేదీ సాయంత్రం 5గం.లు లోగా వ్యక్తిగతంగా గాని లేదా పోస్టు ద్వారా గాని సంబంధిత సంస్థల ప్రిన్సిపాళ్ళకు అందజేయాల్సి ఉంటుందని ఆలస్యంగా అందించిన ధరఖాస్తులకు ఆయా సంస్థలకు ఏమాత్రం బాధ్యత ఉండదని ఆయన స్పష్టం చేశారు.

    

Comments