హౌసింగ్ ఒన్ టైం సెటిల్మెంట్ పై వారంలోగా ప్రొసీజర్స్,ఎస్ఓపిలు ఖారారు చేయాలి:సిఎస్ డా.సమీర్ శర్మ
అమరావతి,1 అక్టోబరు (ప్రజా అమరావతి):రాష్ట్రంలో గృహనిర్మాణ పధకంలో ఒన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి వారం లోగా ప్రొసీజర్స్,ఎస్ఓపి(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్)ను ఫైనలైజ్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.శుక్రవారం అమరావతి సచివాలయంలో గృహ నిర్మాణ పధకంలో ఒన్ టైం సెటిల్మెంట్ అంశంపై సంబంధిత అధికారులతో సిఎస్ సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒన్ టైం సెటిల్మెంట్ కు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి వారం రోజుల్లోగా అందుకు సంబంధించిన ప్రొసీజర్స్ ను,ఎస్ఓపిలను ఫైనలైజ్ చేయాలని సిఎస్ డా.సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు.
ఈసమావేశంలో సిసిఎల్ఏ నీరబ్ కుమార్ ప్రసాద్,గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్,పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది,సెక్రటరీ పొలిటికల్ ఆర్.ముత్యాల రాజు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment