సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలియజేసిన ఏపీ ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు.


అమరావతి (ప్రజా అమరావతి);


సచివాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను కలిసి ధన్యవాదాలు తెలియజేసిన ఏపీ ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు.ఆర్య వైశ్య సత్రాలు, ఆర్య వైశ్య అన్నదాన సత్రాల నిర్వహణ ఆర్య వైశ్యులకే అప్పగిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేసి ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసిన ఆర్య వైశ్య సంఘం ప్రతినిధులు.


ఈ సందర్భంగా సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌కు వెంకటేశ్వర స్వామివారి జ్ఞాపిక, పుష్పగుచ్చం అందజేసి ధన్యవాదాలు తెలిపిన దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఏపీ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్, ఆర్టీఐ కమిషనర్‌ రేపాల శ్రీనివాస్, విజయవాడ అర్బన్‌ జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధర రావు.