లబ్ధిదారులకు వైఎస్సార్ ఆసరా చెక్కు

  పాలమూరు (ప్రజా అమరావతి);     పొలమూరు , మాముడూరు సంబంధించి పొలమూరు హైస్కూల్ గ్రౌండ్ నందు గ్రామ సభలో లబ్ధిదారులకు వైఎస్సార్  ఆసరా చెక్కు


ను   రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు  శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథరాజు , జిల్లా పరిషత్ చైర్మన్ కె. శ్రీనివాస్ లు  అందజేశారు.


ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ కవురు శ్రీనివాస్ ను మంత్రి శ్రీరంగనాధ రాజు, తదితరులు ఘనంగా సన్మానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని, ముఖ్యమంత్రి పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని, పశ్చిమగోదావరి జిల్లా ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుండి నడిపించాలని సూచించారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా ప్రజల్లో సుస్థిరమయిన స్థానాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాదించుకున్నారని, ఆయన స్పూర్తితో ముందడుగు వేయాలన్నారు.

Comments