ఉద్యోగుల విధి నిర్వహణలో కనీసం ప్రాధమిక బాధ్యత ఉండాలి..కొవ్వూరు (ప్రజా అమరావతి);


ఉద్యోగుల విధి నిర్వహణలో  కనీసం ప్రాధమిక బాధ్యత ఉండాలి..


మీమీ బాధ్యతలు, విధుల నిర్వహణలో  నిర్లక్ష్యం తగదు.. 


లే అవుట్ లలో అంతర్గత రహదారుల, లేవిలింగ్ పనులు వేగవంతం చెయ్యాలి


పెరవలి హౌసింగ్ ఏ ఈ  అభినందించ తగ్గ పనితీరు చూపుతున్నారు..


...    కలెక్టర్ కార్తికేయ మిశ్రా.జిల్లాలో ఇళ్ల నిర్మాణం కోసం రెండోవ దశ లేవిలింగ్ పనులు ఎన్ని ఉన్నాయి తెలుసుకుని ఆయా పనులు వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ప్రత్యక్ష పర్యవేక్షణ చెయ్యాల్సి ఉందని సూచించారు. 
శుక్రవారం సాయంత్రం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని హౌసింగ్, ఎన్ఆర్ఈజిఎస్, రెవెన్యూ , హెల్త్, పురపాలక, పంచాయతీ రాజ్, విద్యా, ఐసీడీఎస్, డిఆర్డీఏ, వ్యవసాయం, పౌర సరఫరాల, క్లాప్ ప్రోగ్రాం, ఉద్యానవన, మత్స్య శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో కలెక్టర్ అంశాల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ, మండల స్థాయి లో చేపట్టే అభివృద్ధి పనులు రాష్ట్ర స్థాయి సగటు కంటే ఎందుకు తక్కువ ఉందని, సోమవారం నాటికి పనులు పురోగతి సాధించాలని స్పష్టం చేశారు. మండల పరిధిలో హౌసింగ్ లే అవుట్స్, ఆర్భికెలు, జలజీవన్ మిషన్, హెల్త్ క్లినిక్స్, తదితర ప్రాజెక్టుల నిర్మాణం స్థాయి అధికారులకు తెలిసి ఉండాలి. అధికారుల మధ్య సమన్వయం రాజ్ కమల్ సర్కస్ ను తలపిస్తున్నాయి.  సమీక్ష కి వొచ్చే ముందు అంశాలపై అవగాహన ఉండాలన్నారు. ప్రతి ఒక్క మండల స్థాయి అధికారి , వివిధ శాఖల సిబ్బంది వారి వారి శాఖల ప్రాధమిక విధులపై అవగాహన ఉండాలి.  తణుకు ఎన్ఆర్ఈజిఎస్ ఏపిఓ  పై చర్యలు తీసుకోవాలని పీడీ డ్వామా ని,  తణుకు, పెరవలి ఎంపిడిఓ లకి షోకాజ్ నోటీస్ జారిచెయ్యమని జడ్పి సీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు. పనుల్లో పురోగతి చూపని అధికారులపై వ్యక్తిగత పర్యవేక్షణ ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టాల్సి పనుల పురోగతి పై దృష్టి సారించాలన్నారు. ఇళ్ల కాలనీల్లో లే అవుట్స్,  త్రాగునీరు, అప్రోచ్ రహదారుల, విద్యుత్, భూముల లేవిలింగ్, తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. గ్రామ సచివాలయ భవనాలు, హెల్త్ క్లినిక్స్ భవనాల ప్రగతిపై ప్రశ్నించారు. ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాలలకు వొచ్చేలా ఎమ్ఈఓ లు వ్యక్తిగత భాద్యత తీసుకుని వొచ్చి, తల్లిదండ్రుల కమిటీలు తో సమావేశం నిర్వహించాలన్నారు. పాఠశాల లు తనిఖీల్లో చేపట్టిన వివరాలు పై కలెక్టర్ ప్రశ్నించారు. గోరుముద్ద , మధ్యాహ్న భోజనం నాణ్యత లను వ్యక్తి గతంగా పరిశీలించాలి అని స్పష్టం చేశారు. మీమీ మండలంలో ఉన్న సంక్షేమ వసతి గృహాలను తాహసీల్దార్, ఎంపిడిఓ  నెలకు ఒక్కసారి తనిఖీ చెయ్యాలి, వారానికి కనీసం రెండు లే అవుట్స్ పనులు పూర్తి చేసి అందుబాటులో కి తేవాలి. బి ఎమ్ యు సి యూనిట్స్ స్థాపన వేగవంతం చెయ్యాలి. స్పందన ఫిర్యాదులు పరిష్కారం నాణ్యత ప్రతిబింబించేలా ఉండాలి. కౌలు రైతులకు, ఎస్.హెచ్.జి. మహిళలకు రుణాలు మంజూరు కి బ్యాంకర్లు తో సమీక్ష నిర్వహించాలి. 


స్థానికంగా ఉన్న కార్మికుల తో ఆయా మండలాలు స్థాయి పనులు చేపట్టాలన్నారు. లే అవుట్ పనులు ముమ్మరంగా చేపట్టాల్సి ఉందన్నారు.  కార్మికులు లేరని ఏ ఒక్కపని పెండింగ్ లో ఉండకూడదని స్పష్టం చేశారు. పెండింగ్ పనులపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ సమయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు . పెరవలి,  హౌసింగ్ ఏఈ , గోపాలపురం ఎంపిడిఓ లను కలెక్టర్ అభినందించారు. పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు క్లాప్ ప్రోగ్రాం ప్రగతి, వాహనాలు కేటాయింపు లపై సమీక్షించారు. జగనన్న స్వచ్చ సంకల్పం పై మరింత దృష్టి సారించాలి.సమావేశంలో అత్తిలి, తణుకు , నిడదవోలు, చాగల్లు, ఉండ్రాజవరం, ఇరగవరం, కొవ్వూరు, తాళ్లపూడి, పెనుగొండ,పెనుమంట్ర, పెరవలి, గోపాలపురం మండలాలు మరియు కొవ్వూరు, తణుకు, నిడదవోలు అర్బన్ పై సమీక్షించారు.


ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్( అభివృద్ధి) హిమాన్షు శుక్లా , జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ,జాయింట్ కలెక్టర్  (గృహ నిర్మాణం)  సూరజ్ గానోరె ,జాయింట్ కలెక్టర్( సంక్షేమం ) శ్రీమతి పి.పద్మావతి ,  కొవ్వూరు ఆర్డీవో ఎస్. మల్లిబాబు,  , జిల్లా అధికారులు  , కొవ్వూరు  డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments