కుమారి గెడ్డం స్రవంతి మృతిపై విచారణాధికారిగా కొవ్వూరు ఆర్డీవో
కొవ్వూరు / తణుకు  (ప్రజా అమరావతి);కుమారి గెడ్డం స్రవంతి మృతిపై విచారణాధికారిగా కొవ్వూరు  ఆర్డీవోమార్టేరు ఎస్.సి.సంక్షేమ వసతి గృహం నందు ది.05.11.2021 ఉదయం గం.10.30 లకు విచారణ 


విచారణాధికారి ముందు హాజరై తగిన వివరాలు అందచెయ్యగలరు


... ఆర్డీవో ఎస్. మల్లిబాబు పెనుమంట్ర మండలం, మార్టేరు గ్రామంలో 

ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్ నందు చదువుతూ ది.28.10.2021 న

గెడ్డం సురేష్ వారి కుమార్తె   కుమారి గెడ్డం స్రవంతి (8 వ తరగతి)  అనుమానాస్పదంగా మృతి చెందడం జరిగినది. ఈ విషయమై జిల్లా కలెక్టర్ పశ్చిమగోదావరి జిల్లా వారు విచారణాధికారిగా విచారణ నిమిత్తం శ్రీ రెవిన్యూ డివిజనల్ అధికారి, కొవ్వూరు వారిని నియమించడం జరిగినదని రెవిన్యూ డివిజనల్ అధికారి ఎస్. మల్లిబాబు శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. 


ఇందు నిమిత్తం మార్టేరులోని ఎస్.సి.సంక్షేమ వసతి గృహం నందు ది.05.11.2021 (శుక్రవారం) ఉదయం గం.10.30 లకు కొవ్వూరు రెవిన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నామని మల్లిబాబు తెలియ చేశారు. కావున ఈ సంఘటనపై వివరములు తెలిసినవారు, కుటుంబ సభ్యులైన, గ్రామస్తులైన, ఎవరైనా సరియైన ఆధారాలతో విచారణ కమిటీ ముందు హాజరై సంబంధిత సమాచారమును , వివరాలు అంద జేయవలసినదిగా  యస్.మల్లి బాబు పేర్కొన్నారు.