పారదర్శకంగా లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు !! --- మంత్రి పేర్ని నాని

  

 మచిలీపట్నం : అక్టోబర్  6 (ప్రజా అమరావతి);


పారదర్శకంగా లాటరీ పద్ధతిలో స్థలాల కేటాయింపు !!

     --- మంత్రి పేర్ని నాని 



దేశ చరిత్రలో తొలిసారిగా పెద్ద ఎత్తున 30 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాక వారికి మరింత పారదర్శకంగా  లాటరీ పద్ధతిలో ప్లాట్లు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.    బుధవారం ఉదయం అయన స్థానిక 6 వ డివిజన్  చిలకలపూడిలోని మూడు గుళ్ల సెంటర్ లోని పట్టణ జీవనోపాధుల పరిష్కార కేంద్రం వద్ద  ఇళ్ల స్థలాల పట్టాలు అందచేసే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. లబ్ధిదారుల సమక్షంలో మంత్రి పేర్ని నాని  లే అవుట్ నిర్మాణ తీరు  బోర్డు మీద అందరికి వివరించారు. అక్కడ ఏర్పాటైన అంతర్గత రహదారులు, డ్రైనేజ్ , విద్యుత్, నీటి సరఫరా తదితర వ్యవస్థల గూర్చి ఓపిగ్గా లబ్ధిదారులకు చెప్పారు. 6 వ డివిజన్ లో గుర్తించిన 19 మంది లబ్దిదారులకు వారి చేతితోనే చీటీలు తీయించి  లాటరీ పద్ధతిలో  24 ప్లాట్లలలో  నివేశనా స్థలాలు కేటాయింపు అత్యంత పారదర్శకంగా నిర్వహించి పట్టాలు పంపిణీ చేశారు. 

         ఈ  కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్డీవో ఎన్ ఎస్ కే  ఖాజావలి, తహశీల్ధార్ సునీల్ బాబు, రెవిన్యూ ఇన్స్పెక్టర్ యాకూబ్, మునిసిపల్ ఎం ఈ  త్రినాధ్ రావు, ఎలక్ట్రికల్ ఏ ఈ  సాయి ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఏ ఈ రామ్ ప్రసాద్, 6 వ డివిజన్ కార్పొరేటర్ పర్ణం సతీష్ కుమార్, చలమలశెట్టి గాంధీ , పార్ధ , 9 వ డివిజన్ ఇంచార్జ్ రాసంశెట్టి వెంకట రమణ,  4 వ డివిజన్ ఇంచార్జ్ వడ్డీ రాఘవ, 11 వ డివిజన్ ఇంచార్జ్ గూడవల్లి నాగరాజు, వార్డు  సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు స్థానికులు పలువురు  పాల్గొన్నారు


Comments