తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దంపతులు
*తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దంపతులు*


తిరుపతి, అక్టోబర్, 12 (ప్రజా అమరావతి)


; రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు సతీ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయం మహాద్వారం వద్ద ఆగమ సలహాదారులు, తితిదే అధికారులు.. మంత్రికి  స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ మంత్రి మేకపాటి దంపతులు లేదా పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు వారికి ఆశీర్వచనం అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయం చేరుకుని తిరుపతి పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్ళారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడసేవలోనూ మంత్రి మేకపాటి దంపతులు పాల్గొన్నారు.Comments