*జిల్లా లోని 973 గ్రామాల్లో ”జగనన్న స్వచ్ఛ సంకల్పం” కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలి*
*100 రోజుల జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రతి గ్రామంలో మార్పు రావాలి*
*ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలి*
*ప్రతి ఒక్కరు స్వచ్ఛ గ్రామ నిర్మాణం కొరకు కృషి చేయాలి...*
*జగనన్న స్వచ్ఛ సంకల్పంలో మద్యపానం, మూఢనమ్మకాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి*
*జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు*
కర్నూలు అక్టోబర్ 20 (ప్రజా అమరావతి)
:-జిల్లా లోని 973 గ్రామాల్లో ”జగనన్న స్వచ్ఛ సంకల్పం” కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు..
బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ”జగనన్న స్వచ్ఛ సంకల్పం” జిల్లా స్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మల్కి రెడ్డి వెంకటసుబ్బారెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, నందికొట్కూరు ఎమ్మెల్యే శ్రీదేవి, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డ్వామా పిడి అమర్నాథరెడ్డి, డిపిఓ ప్రభాకర్ రావు, ఎంపీడీవోలు, ఈ ఓ పి ఆర్ డి లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ”జగనన్న స్వచ్ఛ సంకల్పం” కార్యక్రమం అమలు మన బాధ్యత అనుకుని మనస్పూర్తిగా పనిచేయాలని అధికారులకు సూచించారు.. జిల్లాలోని 973 గ్రామాల్లో వంద రోజుల పాటు ఈ కార్యక్రమం జరగాలన్నారు.. ప్రతి గ్రామానికి అధికారులు వెళ్లాలన్నారు.. ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా అభివృద్ధి చేసేందుకు జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.100 రోజుల జగనన్న స్వచ్ఛ సంకల్పం ద్వారా ప్రతి గ్రామంలో మార్పు రావాలన్నారు..ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు..ప్రజా ప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు..ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ ఇళ్ల పరిసరప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజల్లో చైతన్యం తేవాలన్నారు.గ్రామాల్లో పారిశుధ్యం లేనందువల్ల డెంగీ కేసులు ఎక్కువ అవుతున్నాయన్నారు.. మన పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడు వ్యాధులు దరిచేరవన్నారు.
వందరోజుల ఈ కార్యక్రమంలో పారిశుధ్యం తో పాటు మద్యపానం, మూఢనమ్మకాల పై అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్దర్ మాట్లాడుతూ గ్రామాలు పరిశుభ్రంగా ఉంటే ఆ ప్రాంత ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్ మోహన్ రెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామం చూడచక్కని గ్రామంగా తీర్చిదిద్దాలని సంకల్పించారన్నారు.. ఇందుకోసం ఒక చెత్త సేకరించే వాహనాలను ఏర్పాటు చేయడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా చెత్త, మురికి పేరుకుపోయి కొన్ని గ్రామాలలో నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం పాటించకపోవడం వల్ల డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం ద్వారా అందరం కలిసి స్వచ్ఛ గ్రామాలుగా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు.
కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరి కోఆర్డినేషన్ అవసరమన్నారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి జగనన్న స్వచ్ఛ సంకల్పం నిర్వహిద్దామన్నారు..
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ , ఎమ్మెల్యేలు జగనన్న స్వచ్ఛ సంకల్పం లోగోను ఆవిష్కరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ నిర్వహణకు చెత్త రవాణా చేసే వాహనాల ర్యాలీ కి కలెక్టర్ ఎమ్మెల్యేలు జెండా ఊపి గ్రామాలకు సాగనంపారు..
ఈ కార్యక్రమానికి ముందు ఆజాద్ కి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా డ్వామా ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రక్రియపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి గ్రామంలో సామాజిక తనిఖీ ప్రక్రియ పై ప్రజలకు అవగాహన కల్పించాలని, తద్వారా ఉపాధి హామీ పథకం సక్రమంగా నిర్వహణకు వీలవుతుందని జిల్లా కలెక్టర్ ఎంపీడీవోలు, ఏ పీ డీ లు, టెక్నికల్ అసిస్టెంట్ లకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సామాజిక తనిఖీ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ సునీల్, డ్వామా పీడీ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు
addComments
Post a Comment