ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీమ్ ర్యాంకర్లకు మంత్రి మేకపాటి ప్రశంసలు
అమరావతి (ప్రజా అమరావతి);


*ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ క్రాఫ్ట్ మెన్ ట్రైనింగ్ స్కీమ్  ర్యాంకర్లకు మంత్రి మేకపాటి ప్రశంసలు


*


*మరింత ఎదగాలని ప్రోత్సహిస్తూ.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చెక్కుల పంపిణీ*


*రాజీపడకుండా ఆకాశమే హద్దుగా ముందుకెళ్లాలంటూ ఆల్ ది బెస్ట్ తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి*


అమరావతి, అక్టోబర్, 29:  ఏఐటీటీ 2020 (సీటీఎస్‌)లో ఆల్‌ ఇండియా టాప్‌ ర్యాంక్స్‌ సాధించిన అభ్యర్థులను ఐ.టీ, నైపుణ్యాభివృద్ధి,శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. జీవితంలో ఆకాశమే హద్దుగా రాజీపడకుండా ముందుకు సాగాలని వారికి ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు.  ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో సీఎం ఆదేశాల మేరకు వారిని ప్రోత్సహించడం కోసం ఐదుగురు ర్యాంకర్లకు ఒక్కొక్కరికీ  రూ.5 లక్షల చెక్కులను మంత్రి మేకపాటి పంపిణీ చేశారు. నగదు ప్రోత్సాహకంతో పాటు ఏపీఐఐసీలో వారి ఆసక్తి , అర్హతల మేరకు ఏదైనా ఉద్యోగం అందించేందుకు ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ కి దిశానిర్దేశం చేశారు. ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌ (ఏఐటీటీ) 2020 లో క్రాఫ్ట్‌మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ (సీటీఎస్‌) జాతీయ స్ధాయి పరీక్షలో టాప్‌ ర్యాంకులు సాధించడంతోనే సంతృప్తి చెందకుండా మరింత ముందుకు వెళ్లాలని డి.మణికంఠ, మెకానిక్‌ డీజిల్‌ ట్రేడ్‌లో ఆల్‌ ఇండియా సెకండ్‌ ర్యాంక్‌, మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్‌ ఇండియా ఐదో ర్యాంక్‌,ఎన్‌.కుమారి, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఆల్‌ ఇండియా ఆరో ర్యాంక్‌, ఎం.బాల పవన్‌ రాజు, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్, ఆల్‌ ఇండియా ఎనిమిదో ర్యాంక్‌,ఎం.రోషణ్, మెకానిక్‌ ఆర్‌ అండ్‌ ఏసీ, ఆల్‌ ఇండియా తొమ్మిదో ర్యాంకర్లకు మంత్రి మేకపాటి మార్గనిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో పాటు కౌశలాచార్య అవార్డు - 2021ని సాధించిన డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ వై.రజిత ప్రియను కూడా మంత్రి గౌతమ్ రెడ్డి మెచ్చుకుంటూ రూ.5 లక్షల చెక్కును అందజేశారు. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకునే మార్గంలో.. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. అంతకుముందు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన విద్యార్ధులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారు ట్రోఫీతో పాటు, సర్టిఫికెట్, ట్యాబ్‌లను అందజేశారు.


ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐ.టీ, నైపుణ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ ,ఐటీ ఎలక్ట్రానిక్స్‌& కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఉపాధి , శిక్షణ శాఖ డైరెక్టర్‌ లావణ్య వేణి, రీజనల్‌ డైరెక్టర్‌ స్కిల్ డెవలప్ మెంట్ ఏ.వెంకటేశ్వర రావు,  పలువురు అధికారులు పాల్గొన్నారు.