శ్రీ గణపతి సఛ్ఛితానంద స్వామిజీ ఆశ్రమాన్ని సియమ్ జగన్మోహన్ రెడ్డి సందర్శన.....*విజయవాడ (ప్రజా అమరావతి); పటమటలోని 

శ్రీ గణపతి సఛ్ఛితానంద స్వామిజీ ఆశ్రమాన్ని 

సియమ్ జగన్మోహన్ రెడ్డి సందర్శన.....*విజయవాడ, అక్టోబర్ 16*:


 *పటమటలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమాన్ని ఈ నెల 18వ తేదీ ఉదయం* రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించనున్నారు.


*విజయవాడ పటమట శ్రీ దత్తనగర్ లోని అవధూత దత్తా పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి సందర్శించి మరకత రాజరాజేశ్వరి దేవిని* దర్శించుకోనున్నారు.


*ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి భద్రత అధికారులు, ఇతర పోలీసు అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ జె. నివాస్* పరిశీలించారు.


 *వీరి వెంట సబ్ కలెక్టర్ జి.ఎస్.ఎస్.ప్రవీణ్ చంద్,ఏసీపీ హర్షవర్ధన్ రాజు,ఆశ్రమ పర్యవేక్షకులు అవధూత రమేష్, ఎగ్జిక్యూటివ్ ఏ. ఎస్.ఆర్.కె.ప్రసాద్, ట్రస్టు మెంబర్ జి. వి.ప్రసాద్, వియంసి సియం వో హెచ్  డా.జి.గీతబాయ్,  తహసీల్దార్ వెంకట్రావు తదితరులు* పాల్గొన్నారు.