ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్‌



*లా అండ్‌ ఆర్డర్‌పై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


అమరావతి (ప్రజా అమరావతి);

*లా అండ్‌ ఆర్డర్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*– ‘దిశ’ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం... తదితర అంశాలపై సీఎం సమగ్ర సమీక్ష.*



*ప్రతి మహిళ సెల్‌ఫోన్లో ‘దిశ’ యాప్‌:*


*– రాష్ట్రంలో ‘దిశ’ అమలుపై సమీక్షించిన సీఎం*

– ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేశారని వెల్లడించిన పోలీసు అధికారులు

– దిశయాప్‌ద్వారా 5238 మందికి సహాయం

– దిశయాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు 2021లో 684

– నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్‌ చేశామన్న పోలీసులు

– వచ్చిన ఫిర్యాదులపై పరిష్కారం ఎంతవరకూ వచ్చిందన్నదానిపై నిరంతరం మెసేజ్‌లు పంపిస్తున్నామన్న పోలీసులు

– దిశ పోలీస్‌స్టేషన్లు అన్నింటికీ కూడా ఐఎస్‌ఓ సర్టిఫికేషన్‌ వచ్చిందన్న పోలీసు అధికారులు.


– మహిళలపై నేరాలకు సంబంధించి 2017లో ఇన్వెస్టిగేషన్‌కు 189 రోజులు పడితే 2021లో కేవలం 42 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామన్న పోలీసులు

– ‘దిశ’ అమలు కారణంగానే ఇది సాధ్యమైందన్న పోలీసులు

– జీరో ఎఫ్‌ఐఆర్‌లను కూడా నమోదు చేస్తున్నామన్న పోలీసులు

– ఫోరెన్సిక్‌ సదుపాయాలను ప్రభుత్వం పెంచడం వల్ల కేసుల దర్యాప్తు, ఛార్జిషీటులో వేగం పెరిగిందన్న పోలీసులు

– గతంలో డీఎన్‌ఏ రిపోర్టుకోసం ఏడాదిపాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు 2రోజుల్లో నివేదిక వస్తుందన్న పోలీసులు

సంబంధిత కేసుల్లో 7 రోజుల్లో ఛార్జిషీటు వేయగలుగుతున్నామన్న పోలీసులు


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే... :*

– ‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి: సీఎం

– రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలి: సీఎం

– అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి: సీఎం

– ప్రతి మహిళా చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్‌ డౌన్లోడ్‌ కావాలి:

– వలంటీర్లు, మహిళా పోలీసుల సహాయాన్ని తీసుకోవాలి:

– ‘దిశ’యాప్‌పై విస్తృత ప్రచారం నిర్వహించాలి:

– ‘దిశ’యాప్‌ డౌన్లోడ్, వినియోగించే విధానంపై ప్రచారం నిర్వహించాలన్న సీఎం


*‘దిశ’ చట్టం ప్రగతిపైనా సీఎం సమీక్ష:*

– ‘దిశ’బిల్లు ఆమోదం ఏ దశలో ఉందో వివరాలు అందించిన అధికారులు

– శాసనసభలో బిల్లును ఆమోదించి ఇన్ని రోజులైన తర్వాత కూడా పెండింగ్‌లో ఉండడం సరికాదన్న సీఎం

– వెంటనే దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

– ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సీఎం సమీక్ష

– పోక్సో కేసుల విచారణకు ప్రస్తుతం 10 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయన్న అధికారులు 

– డిసెంబర్‌నాటికి మొత్తం 16 కోర్టులు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు

– మహిళలపై నేరాలకు సంబంధించిన 12 కోర్టులు ఆపరేషన్‌లో ఉన్నాయన్న అధికారులు

– కడపలో మరో కోర్టు అందుబాటులోకి వస్తుందన్న పోలీసులు

– ఈ కోర్టుల్లో గవర్నమెంటు ప్లీడర్లను పూర్తిస్థాయిలో ఉంచాలని సీఎం ఆదేశం

– ఎక్కడా ఖాళీలు లేకుండా ప్రభుత్వ న్యాయవాదులను నియమించాలన్న సీఎం, దీనికోసం సత్వరమే చర్యలు తీసుకోవాలన్న సీఎం

– పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పనితీరుపైనా నిరంతరం సమీక్ష చేయాలన్న సీఎం, వారి పనితీరుపైనా కూడా పర్యవేక్షణ చేయాలన్న సీఎం


*– ‘దిశ’ ఒన్‌స్టాప్‌ సెంటర్ల పనితీరుపైనా సీఎం సమీక్ష*

– ఈ ఏడాది సెప్టెంబరు వరకూ 2652 కేసులను దిశ ఒన్‌స్టాప్‌ సెంటర్ల ద్వారా హేండిల్‌ చేశామన్న అధికారులు

– సచివాలయాల్లో మహిళా పోలీసుల వ్యవస్థపైనా సీఎం సమీక్ష

– దేవాలయాల్లో భద్రతకోసం 51,053 సీసీ కెమెరాలు పెట్టించామన్న అధికారులు


*‘బాధితులకు సత్వర న్యాయంపై దృష్టిపెట్టండి’:*

– అమ్మాయిలపై అఘాయిత్యాలను నివారించడమే కాదు, దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం ఆదేశం.

– శరవేంగా బాధితులను ఆదుకోవాలి: సీఎం

– వారికి ఇవ్వాల్సిన పరిహారాన్ని సత్వరమే అందించేలా చూడాలి:

–ఘటన జరిగిన నెలరోజుల్లోపు బాధిత కుటుంబాలకు అందజేయాలి:

– ఎక్కడైనా అలసత్వం జరిగితే వెంటనే నా కార్యాలయానికి సమాచారం ఇవ్వండి: సీఎం


*సైబర్‌ క్రైం నిరోధంపై ప్రత్యేక కార్యాచరణకు సీఎం ఆదేశం:*

– సైబర్‌ క్రైం నిరోధానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించండి: సీఎం

– సమర్థత ఉన్న అధికారులను ఇందులో నియమించండి:

– సమర్థవంతమైన న్యాయవాదులను కూడా ఈ విభాగంలో  పెట్టాలి:

– ఏపీకి సంబంధంలేని డ్రగ్‌ వ్యవహారంపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారు:

– లేని అంశాన్ని... ఉన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు:

– వ్యక్తులపై తప్పుడు ఆరోపణలు, ప్రచారం చేస్తున్నారు :

– ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తప్పుడు ప్రచారం చేస్తోంది: సీఎం

– పోలీసు వ్యవస్థ ప్రతిష్టను, ప్రభుత్వంతోపాటు వ్యక్తుల ప్రతిష్టలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ప్రచారం చేస్తున్నారు : సీఎం

– ఏపీలో డ్రగ్స్‌ వ్యవహారం నిజం కాదని తెలిసికూడా ఇవే వార్తలను కొన్ని మీడియా సంస్థలు, వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రచారం చేస్తున్నాయి:

– ఇలాంటి అంశాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి:


‘కేసుల సంఖ్యను పట్టించుకోవద్దు.. ఫిర్యాదు చేయడానికి బాధితులు ముందుకొచ్చే పరిస్థితుల కల్పనే ముఖ్యం’:


– ఫిర్యాదుదారులకు వెసులుబాటుగా వ్యవస్థ ఉండాలి: సీఎం

– ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలి:

– ఎఫ్‌ఐఆర్‌లు పెరుగుతాయని వెనకడుగు వేయకూడదు:

– బాధితులు స్వేచ్ఛగా ముందుకురావాలి, వారు ఫిర్యాదు చేయాలి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి:

– బాధితుడికి భరోసాగా పరిస్థితులు ఉండడం అన్నది ముఖ్యం:


*‘‘మాదక ద్రవ్య రహితంగా కాలేజీలు, యూనివర్శిటీలు–తక్షణ చర్యలకు సీఎం ఆదేశం:*


– అన్నికాలేజీలు, యూనివర్శిటీల్లో పర్యవేక్షణ  ఉండాలి: సీఎం

– మాదకద్రవ్యాల ఉదంతాలు ఉన్నాయా? లేవా? సమీక్షించాలి:

– ఉంటే గనుక అలాంటి కాలేజీలను మ్యాపింగ్‌ చేయాలి:

– ఎవరు పంపిణీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి వస్తున్నాయన్న దానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి:

– కాలేజీలు, యూనివర్శిటీల్లో మాదకద్రవ్యాల ఆనవాళ్లు ఉండకూడదు:

– దీన్ని ఒక సవాల్‌గా తీసుకోండి:

– కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వండి:

– ప్రతి నాలుగు వారాలకు ఒకసారి దీనిపై ప్రగతి నివేదికలు సమర్పించండి:

– ఒక కార్యాచరణను రూపొందించుకోండి:

అన్ని కాలేజీలు, యూనివర్శిటీలు డ్రగ్‌ ఫ్రీగా ఉండాలన్నది ప్రధాన ఉద్దేశం:


*‘మద్యం అక్రమ తయారీ, రవాణాలపై ఉక్కుపాదం’:*


– రాష్ట్రంలో అక్రమంగా మద్యం తయారీ, అక్రమ రవాణాలపై ఎస్‌ఈబీ సహా... పోలీసులు ఉక్కుపాదం మోపాలి:

– అధికారంలోకి రాగానే 43వేల బెల్టుషాపులు తీసేశాం:

– మద్యం అమ్మే దుకాణాలను మూడోవంతు తగ్గించాం: 

– మద్యం అమ్మకాల వేళలు తగ్గించాం:

– ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది:

– అంతేకాకుండా మద్యం రేట్లు పెంచాం:

– దీనివల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది:

– మద్యం అక్రమ రవాణా, తయారీకి ఆస్కారం ఇవ్వకూడదు :

– దీన్ని నిరోధించడానికి అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి:

– ఎస్‌ఈబీతోపాటు, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి:

– ఇసుక అక్రమ రవాణాపైన కూడా చర్యలు తీసుకోవాలి:

– గుట్కా నిరోధంపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం

– అవసరమైతే చట్టం తీసుకురావాలన్న సీఎం


– ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 15వేల మంది మహిళా పోలీసులను నియమించాం:

– ఈ  మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వాలి:

– డిసెంబరు నాటికి శిక్షణ పూర్తిచేయాలి:

– వచ్చే ఏడాది కనీసంగా 6 నుంచి 7వేల మంది పోలీసుల నియామకాలపై దృష్టిపెట్టాలన్న సీఎం

– దీనికి సంబంధించి సంబంధిత శాఖలు సిద్ధంకావాలన్న సీఎం


ఈ సమీక్షా సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ఆర్ధిక శాఖ కార్యదర్శి కె సత్యనారాయణ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కే వి రాజేంద్రనాథ్‌ రెడ్డి,  వివిధ రేంజ్‌ల డీఐజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరు.

Popular posts
స్నేహితులకి ఒకేసారి మోకాలు ఆపరేషన్ చేసిన డాక్టర్ జగదీష్
Image
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి కత్తెర హెని క్రిస్టినా సురేష్ గారిని కలిసిన జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు మరియు సభ్యులు
Image
గుంటూరు మెడికల్ కాలేజీ 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కళాశాల ఆవరణలో పైలాన్ను ఆవిష్కరణ.
Image
యువత తలచుకుంటే ఆకాశం హద్దు కాదు..సముద్రం లోతూ కాదు : నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
Image
.ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మాతృమూర్తి సింహాద్రి భారతమ్మకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఘనంగా నివాళులర్పించారు
Image