టీటీడీ ఐటీ సేవలను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్

 తిరుమల (ప్రజా అమరావతి);    టీటీడీ ఐటీ సేవలను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్


జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ మరియు టిటిడి మధ్య ఎంఓయూ.*


తిరుమల శ్రీవారి పై అపారమైన భక్తితో రిలయన్స్ జియో యాజమాన్యం టీటీడీ  ఐటీ విభాగానికి సంబంధించిన అన్ని సేవలను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. టిటిడి చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో  రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ తో టీటీడీ ఎంవోయూ కుదుర్చుకుంది

. టీటీడీ ఐటీ విభాగానికి కావాల్సిన హార్డ్వేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సాఫ్ట్ వేర్ ని పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చి ఎంఓయూ కుదుర్చుకున్న రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్. తిరుమల శ్రీవారి భక్తులకు అతి ఆధునిక టెక్నాలజీతో సాఫ్ట్ వేర్ తో మొబైల్ యాప్ తయారు చేయనున్న జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ సంస్థ. ఈ యాప్ ద్వారా టీటీడీ కి సంబంధించిన పూర్తి సేవలను అందించడంతోపాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉపయోగపడేలా ఈ యాప్ అతి ఆధునిక టెక్నాలజీతో రూపుదిద్దుకోనుంది.

Comments