బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను లబ్ధిదారులు తిరిగి సక్రమంగా చెల్లించాలి...



 *బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను లబ్ధిదారులు తిరిగి సక్రమంగా చెల్లించాలి...


.* 


 *బ్యాంకులు ఇచ్చే రుణాలతో ప్రజలు ఆర్థిక అభివృద్ధి చెందాలి...* 


 *మహిళలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది..* 


 *జిల్లాలో 27404 మంది లబ్ధిదారులకు 521.87 కోట్ల రుణాలు మంజూరు...* 


 *జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు...* 


కర్నూలు అక్టోబర్ 29:-


బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను లబ్ధిదారులు తిరిగి సక్రమంగా చెల్లించి తద్వారా ఆర్థిక అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పేర్కొన్నారు.


 శుక్రవారం  స్థానిక రావూరి ఫంక్షన్ హాల్ నందు "రుణ వితరణ కార్యక్రమం" నిర్వహించారు. 


ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు,

డిజిఎం బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ వివి సోమశేఖర్,

జిఎం ఏపీజీబీ హెచ్ వో కడప కె. విజయభాస్కర్, ddm నాబార్డు కర్నూల్ ఏ.పార్తవ,

రీజినల్ హెడ్ ఇన్చార్జి కెనరా బ్యాంకు కర్నూల్ ఎల్. రాధాకృష్ణారెడ్డి,

రీజినల్ హెడ్ రీజినల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్నూల్ ప్రశాంత్ దేశాయ్,

రీజినల్ హెడ్ ఎస్బిఐ కర్నూల్ సూర్య ప్రకాష్,

రీజినల్ హెడ్ ఏపీజీబీ కర్నూల్ ఎస్. భాస్కర్ రెడ్డి,

లీడ్ బ్యాంక్ మేనేజర్ వై. వెంకటనారాయణ, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను లబ్ధిదారులు సక్రమంగా తిరిగి చెల్లించాలన్నారు. మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందితే వారి కుటుంబం ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. దీంతో ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బ్యాంకర్లు స్వయం సహాయక సంఘాలకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. సంఘ సభ్యులు తీసుకున్న రుణాలను ఏ అవసరానికి అయితే రుణాల పొందారో వాటికి మాత్రమే వినియోగించి ఆర్థిక అభివృద్ధి చెందారన్నారు.  రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించే వారికి ప్రభుత్వ సహకారం ఉంటుందన్నారు.

కొంతమందికి బ్యాంకు సబ్సిడీలు, రుణాల పై అవగాహన లేకపోవడంతో బ్యాంకు రుణాలు సరిగా సద్వినియోగం చేసుకోలేక పోతున్నారన్నారు. బ్యాంకర్లు రుణ మేళాలు ఏర్పాటుచేసి ఆయా బ్యాంకు పరిధిలో ఇచ్చే రుణాల గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.

జిల్లాలో వివిధ బ్యాంకుల ద్వారా 27404 మంది లబ్ధిదారులకు 521.87 కోట్ల రూపాయల  రుణ అర్హత పత్రాలకు సంబంధించిన మెగా చెక్కుల లబ్ధిదారులకు అందజేయడం  జరిగిందన్నారు. ఇందులో గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలకు సంబంధించి 2779 మంది లబ్ధిదారులకు139.50 కోట్లు,

వ్యవసాయ రుణాలకు సంబంధించి17713 మంది లబ్ధిదారులకు 259.18 కోట్లు,

వ్యవసాయ రుణాలకు సంబంధించి5585 మంది లబ్ధిదారులకు64.25 కోట్లు,

స్వయం సహాయక సంఘాలకు సంబంధించి1147 మంది లబ్ధిదారులకు65.93 కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు..


అనంతరం జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళా అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నా రు. ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.

లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట నారాయణ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో రుణ మేళాలు ఏర్పాటుచేసి ప్రజలకు అవసరమైన వ్యవసాయ, విద్య రుణాలు, చిన్న పరిశ్రమల స్థాపనకు సంబంధించినటువంటి    రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులు అందరూ  తమ పరిధిలోని బ్యాంకులను సంప్రదించి బ్యాంకులు ఇచ్చే రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా జిల్లాలోని 27 బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటుచేసి తమ బ్యాంకు పరిధిలో ఇచ్చే రుణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.



Comments