జగనన్న తోడు

 

అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న తోడు


*


*క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన లబ్దిదారులు ఏమన్నారంటే...*


*ఏలూరు పట్టణంలోని 36 డివిజన్ ఆర్ ఆర్ పేట కు చెందిన కె. నాగజ్యోతి తన స్పందనను ఈ విధంగా తెలియజేశారు...*


అన్నా...మీరు ప్రవేశపెట్టిన ప్రతీపథకాన్ని కుటుంబంలోని ప్రతీ ఒక్కరూ లబ్ధి పొందుతున్నారని పి.నాగ జ్యోతి ముఖ్యమంత్రికి తెలిపారు.

తాను సాయినాథ్ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని ఫ్యాన్సీ షాప్ పెట్టుకొని ప్రభుత్వం నుండి  జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందుతున్నానన్నారు. కరోనా విపత్తులో లాక్ డౌన్ మూలంగా తన వ్యాపారం సరిగా జరగకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానన్నారు. వార్డు వాలంటీర్ ద్వారా జగనన్న తోడు పథకాన్ని గురించి తెలుసుకొని దరఖాస్తు చేసుకున్నానని, వెంటనే  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 10వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పొందాను అన్నారు. తనకు ఇద్దరు పిల్లలని అమ్మఒడి ద్వారా రెండు సంవత్సరాలుగా 15వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని పొంది ఆ డబ్బుతో పిల్లలను బాగా చదివించుకొంటున్నానన్నారు.తన తల్లి,అత్తకు ప్రతినెలా ఒకటో తేదీనే వాలంటీర్ ఉదయాన్నే తలుపు తట్టి పింఛన్ అందిస్తున్నారని, ఇప్పుడు వారు ఎవరిపై ఆధారపడకుండా వారికి నీవు తమ్ముడుగా తన తమ్ముడు ప్రతి నెల 2,250  పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాడని ఆనందంగా చెబుతున్నారన్నారు. వైయస్సార్ ఆసరా పథకంలో 15 వేల రూపాయల వరకు రెండుదఫాలుగా రుణమాఫీ జరిగిందన్నారు. పండుగలన్నీ కుటుంబంతో సంతోషంగా జరుపుకుంటున్నానని, ప్రతి నెల రేషన్ తన ఇంటివద్దే తీసుకుంటున్నామన్నారు. గతంలో క్యూలైన్లో నిలబడి రేషన్ కోసం పనులు మానుకొని అనేక ఇబ్బందులు పడేవారమని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నామని,  కుటుంబంలో అందరూ ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకొంటున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా దర్జాగా మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్య సేవలు పొందుతున్నామని అన్నారు. మీరు ప్రవేశపెట్టిన దిశ యాప్ మహిళలకు ఎంతో భద్రత, రక్షణగా ఉందన్నారు. అన్న పక్కనున్నాడనే  ధైర్యం తమలో కలిగిందని అన్నారు.తన అన్నఆటో నడుపుకుంటాడని, లాక్ డౌన్ సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాడని, నేడు వాహన మిత్ర ద్వారా ఆర్థిక సాయం పొందుతున్నాడన్నారు. 

సచివాలయ వ్యవస్థ ఎంతో అద్భుతమని గతంలో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ పనుల కోసం తిరిగి  కాలం వృథా అయ్యేదని, నేడు తన ఇంటి సమీపంలోనే సచివాలయం రావడంతో  ఇబ్బందులు తీరాయన్నారు.

ప్రతీకుటుంబంలోని ప్రతీ ఒక్కరూ ప్రతీ పథకాన్ని అందుకుంటున్నారన్నారు.

అన్నలా, తమ్ముడిలా, తండ్రిగా, మావయ్యలా అందరి కష్టాలు తీరుస్తున్న మీరే మాకు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని, చల్లగా ఉండాలని అంటూ  నాగ జ్యోతి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌కు తన స్పందనను తెలియజేశారు.


*పిలకా పద్మ, లబ్దిదారు, సీహెచ్‌ రాజాం, రణస్ధలం మండలం, శ్రీకాకుళం జిల్లా*


వీధుల్లో తిరుగుతూ చేసే వ్యాపారం నుండి కూరగాయల దుకాణం ఏర్పాటు చేసుకునే స్థాయికి ఎదిగానని, రోజుకు నాలుగు ఐదు వందల రూపాయలు ఆదాయం లభిస్తుందని, నెలకు పది నుండి పదిహేను వేల రూపాయలు ఆదాయం కుటుంబానికి వస్తుందని చెప్పారు. తన పిల్లలు ఇద్దరు ఆరవ తరగతి, ఏడవ తరగతి చదువుతున్నారని వారికి గత రెండు సంవత్సరాలుగా అమ్మ ఒడి పథకం కింద 30 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ అయిందని అన్నారు. ముప్పై వేల రూపాయలను పిల్లల చదువులకు వినియోగిస్తున్నామని వారి విద్యాభ్యుదయానికి సహకరిస్తుందని పద్మ వివరించారు. తన భర్తకు రైతు భరోసా క్రింద రూ.13500 వస్తుందని చెప్పారు. చిరు వ్యాపారం చేసుకోవడమే కాకుండా శ్రీ కనకదుర్గ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉన్నానని, సంఘంగా రూ.7.50 లక్షలు రుణం తీసుకున్నామని అందులో ఆసరా క్రింద రూ.6 లక్షల రుణం మాఫీ జరిగిందని పద్మ చెప్పారు. మొదటి ఏడాది ఒక్కో సభ్యునికి రూ.12,500, రెండో ఏడాది ఒక్కో సభ్యునికి రూ.12,500 అందాయని వివరించారు. ఈ ఏడాది వచ్చిన సొమ్ముతో ఆవును కొనుగోలు చేశామని, ప్రతిరోజు లీటర్ నుండి రెండు లీటర్ల పాలు ఇస్తుందని దాన్ని విక్రయించడం ద్వారా కుటుంబానికి ఆర్థికంగా అండ లభించిందని అన్నారు. తమ కుటుంబానికి జగనన్న పథకాల ద్వారా ఏడాదికి లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం అందిందిదని పద్మ చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రిగా చిరకాలం కొనసాగి పేదలకు అండగా నిలవాలని పద్మ ఆకాంక్షించారు.


*మాధవి, లబ్దిదారు, వెంకటాచలం, నెల్లూరు జిల్లా*


మా జగనన్నకు నమస్కారాలు.. అన్నా మీరు అందించే పథకాలు అన్ని లబ్ధి పొందుతున్నాను. నేను వెంకటాచలం గ్రామంలో చీరల వ్యాపారం చేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొని పెట్టుబడిగా పెట్టి వచ్చిన ఆదాయం మొత్తాన్ని వడ్డీలకే కట్టేదాన్ని. తమరు ప్రారంభించిన జగనన్న తోడు పథకం ద్వారా మా వాలంటీరు నాకు పదివేల రూపాయలు వస్తుందని చెప్పాడు. దీంతో ఆ పథకం ద్వారా నేను పదివేల రూపాయలు రుణంగా పొందాను. ఈ డబ్బులతో వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అధిక వడ్డీ లను చెల్లించే బాధ తప్పింది. దీంతో రోజుకు 500 రూపాయల వరకు ఆదాయం పొందుతూ ప్రతి నెల సుమారు 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నాను. తీసుకున్న రుణాన్ని కూడా క్రమం తప్పకుండా బ్యాంకుకు చెల్లిస్తున్నాను. అలాగే ఇటీవలే నాకు వైయస్సార్ ఆసరా పథకం కింద పొదుపు ఖాతా కు పదివేల రూపాయలు ఇచ్చారు. పావలా వడ్డీకి ఐదు వేల రూపాయలు రుణంగా కూడా తీసుకున్నాను. మా పాపకు అమ్మ ఒడి నగదు గత రెండేళ్లుగా ఒకసారి 15000, రెండోసారి 14 వేల రూపాయలు వచ్చింది. మా పాప పుట్టినరోజు జనవరి తొమ్మిదో తారీఖు నాడు నాకు అమ్మ ఒడి డబ్బులు పడడంతో మా పాపకు కొత్త బట్టలు తీసి కేక్ కట్ చేసి పుట్టినరోజు చేసాము. అలాగే నాడు నేడు పథకం కింద పాఠశాలలను బాగా మార్చారు. టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయి. మంచి ఆహారం అందిస్తున్నారు. ఒకప్పుడు పాఠశాలకు మా పాప వెళ్లనని మారాం చేసేది ఇప్పుడు సంతోషంగా వెళుతుంది. నేను ఈరోజు తమరితో మాట్లాడుతున్నానని తెలిసి  మా జగన్ మేనమామకు శుభాకాంక్షలు చెప్పమని మా పాప చాలా సంతోషంగా చెప్పింది. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా తమరు అందించే ప్రతి పథకాన్ని నేను పొందుతున్నాను. మాకు ఎల్లప్పుడూ మీరే సీఎంగా ఉండాలన్నా...

Comments