ఇంద్ర కీలాద్రి (ప్రజా అమరావతి);
*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ*
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తులకు ఇవ్వవలసిన సౌకర్యాలు మరియు కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలి. అనే విషయములో గౌ. జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, కమిషనర్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారి అద్యక్షన జరిగిన టాస్క్ ఫోర్స్ సమావేశములో తీసుకొన్న నిర్ణయాలు మరియు సంచాలకులు, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు సూచించిన నిబందనలు వైద్య ఆరోగ్య శాఖ, దేవాదాయ దర్మాదాయ శాఖ మరియు మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ వారి సంయుక్త నిర్వాహణలో పూర్తి స్థాయిలో అమలు జరుగుతున్నాయి.
1. )శరన్నవరాత్రులు జరుగుతున్న అన్ని రోజులు 9 మెడికల్ క్యాంప్ లు 24 గం.లు విదులు నిర్వహించేలా ప్రతి క్యాంప్ లో వైద్యాదికారితో పాటు స్టాఫ్ నర్స్ మరియు 4 వైద్య సిబ్బందిని నియమించటం జరిగినది.
2.) వైద్యశిబిరములతో పాటుగా అత్యవసర వైద్యం అందించటం కొరకు నిపుణుల బృందంతో తాత్కాలిక ఆసుపత్రిని ఏర్పాటు
చేయటం జరిగినది.
3.) ఎమర్జెన్సీ కేసులను రెఫరల్ ఆసుపత్రులకు తరలించుటకు 3 అంబులెన్స్ లను 24 గం.ల పాటు అందుబాటులో ఉంచటం జరిగినది.
4. )వైద్య ఆరోగ్య శాఖ వారు నిర్వహించుచున్న విదులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి యొక్క వాట్స్ యాప్ నెంబర్ ద్వారా ఒక గ్రూప్ ను తయారుచేసి ప్రతి సిబ్బందికి ఎదురయ్యే ప్రతి అసౌకర్యాన్ని అధిగమిస్తూ, భక్తులకు ఇచ్చే వైద్యసేవలు కోవిడ్ నిబందలనను ఎప్పటికప్పుడు సమాచారం అంధిస్తున్నాము.
5). ప్రతి క్యాంప్ లో మాస్క్ లు, శానిటైజర్ లు, ధర్మల్ స్కానర్ లు ఉండే విదముగా చర్యలు చేపట్టటం జరిగినది.
6. )దేవాలయం క్రింద బాగమైన వినాయక స్వామి గుడి నుండి మొదలు దేవాలయం రాజగోపురం వరకు 24 గం.ల పాటు షిఫ్ట్ ల వారీగా ప్రతి 40 మీటర్లకు ఒక ఆశా కార్యకర్తను నియమించి సానిటైజ్ చేయటం, మాస్క్ లు లేనివారికి మాస్క్ లు అందించటం, ధర్మల్ స్కానర్ ద్వారా శరీర ఉష్ణోగ్రతను గమనించటం కొరకు మొత్తం 150 మంది ఆశా కార్యకర్తలను నియమించటం జరిగినది.
7. )ప్రతి 10 మంది ఆశా కార్యకర్తలను పర్యవేక్షించటానికి ఒక ఏ ఎన్ ఎమ్ ను నియమించటం జరిగినది.
8.) మార్గమద్యంలో భక్తులు త్రాగుటకు మంచినీటిని అందించటం కొరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వారు వాలెంటీర్లను నియమించటం జరిగినది.
9.) కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి 3 సెంటర్లలో కోవిడ్ పరీక్షలు నిర్వహించి ఫలితాన్ని వెంటనే తెలియజేసే విధముగా ఏర్పాటు చేయటమైనది.
10.) ప్రతి 3 కేంద్రాలను పర్యవేక్షించటానికి ఒక డివిజినల్ స్థాయి వైద్యాదికారిని నియమించటం జరిగినది.
11. )కోవిడ్ నిబందనలను అనుసరించి కోవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యాధిగ్రస్తులు కొరకు ఐసోలేషన్ కేంద్రాన్ని వైద్య నిపుణుల బృందము 24 గం,లు విదుల్లో వుండే విధముగా ఏర్పాటుచేయటమైనది.
. పైన పేర్కొన్న కార్యక్రమాలను
గౌ. కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్, కృష్ణా జిల్లా, గౌ. కమీషనర్, మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ, గౌ. కమీషనర్, శ్రీ కనకదుర్గ దేవస్థానం, విజయవాడ, గౌ. సబ్ కలెక్టర్, విజయవాడ. గౌ. జాయింట్ కలెక్టర్ (ఆరోగ్యము మరియు అభివృద్ధి), కృష్ణా జిల్లా, గౌ. జాయింట్ కలెక్టర్ (ఆసరా), కృష్ణా జిల్లా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి, కృష్ణా జిల్లా మరియు CMOH, మున్సిపాల్ కార్పొరేషన్, విజయవాడ. వారి స్వీయ పర్యవేక్షణలో ఏ విధమైన లోపాలు లేకుండా విజయవంతముగా కోవిడ్ నిబందనలు పాటిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణములో నవరాత్రులు జరుగుతున్నాయని తమ ద్వారా ప్రజలకు
తెలియజేయు చున్నాము.
addComments
Post a Comment