ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి);
అమ్మ వారి ఆశీస్సులు రంగారావు సత్యకళ దంపతులకు ఉండాలని ఆలయ కార్యనిర్వాహణాధికారి డి. బ్రమరాంబ అన్నారు.
విజయవాడ నగరానికి చెందిన కావేటి రంగారావు సత్య కళ దంపతులు లక్ష రూపాయలు చెక్కును అన్నదాన వితరణ కోసం శనివారం ఆలయ ఈవో డి బ్రమరాంబకు ఆమె చాంబర్లో అందజేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అన్నదానాన్ని అందించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఆమె అన్నారు. అన్ని దానాల్లో అన్నదానం మిన్న అని, భక్తుల సౌకర్యార్థం దాతలు లక్ష రూపాయల చెక్కును అందించడం పట్ల అమ్మవారి కరుణాకటాక్షాలు ఆ కుటుంబంపై ఉండాలని ఆమె అన్నారు.
చెక్కులు అందించిన వారిలోకుటుంబ సభ్యులు సాయి చైతన్య, వంశీ కృష్ణ,జీవని సాయి ఉన్నారు.
addComments
Post a Comment