మీరు చెప్పారంటే చేస్తారంతే


అమరావతి (ప్రజా అమరావతి);


*వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌*

*వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు*

*వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం*


*క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*ఈ సందర్భంగా మాట్లాడిన వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, రైతులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే*


*కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి*


సీఎం సార్‌... మీరు చెప్పారంటే చేస్తారంతే


అని ఈ రోజు రాష్ట్రమంతా మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతుంది. దీపావళి కంటే ముందే మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర రైతాంగానికి వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ క్రింద నిధులు ఇవ్వడం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ఇవ్వాల్సిన సబ్సిడీని ఇవ్వడం ద్వారా రైతులపై మీ ప్రేమను మరోసారి గుర్తుచేశారు. ఈ రోజు దేశమంతా రాష్ట్రం వైపు చూస్తున్న పరిస్ధితి ఉంది, అన్ని రాష్ట్రాలు మన వైపు చూడటానికి గల కారణం, వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి ఏ విధానాలు అవలంభిస్తున్నారు, అమలుచేస్తున్నారు అనేది మీ ఆలోచనలు, మీ సంకల్పమే కారణం. రైతు భరోసా కేంద్రాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నీతిఆయోగ్‌ వారు కూడా ఇక్కడి అధికారులను పిలుచుకుని అన్నీ తెలుసుకుని అభినందించారు. వివిధ రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు ఇక్కడ పర్యటించి వైఎస్‌ఆర్‌ రైతు భరోసా కేంద్రాల మోడల్‌ను తాము కూడా చేస్తామంటున్నారు. కేవలం రైతులకు ఇన్‌పుట్స్‌ ఇచ్చే వరకే కాకుండా దానిని ఒక విజ్ఞాన కేంద్రంగా, అన్ని సేవలు అందించేలా విత్తనం నుంచి విక్రయం వరకూ రైతులకు ఉపయోగపడే ఒక కేంద్ర కార్యాలయంగా మార్చడం గొప్ప విషయం. సోషల్‌ ఆడిట్‌ ద్వారా ప్రతీ ఒక్కటి ఆ గ్రామంలో ఏం జరుగుతుందో రైతులకు తెలియజేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. గతంలో అర్హులను కాదని అనర్హులకు ఇచ్చేవారు, కానీ ఇప్పుడలా లేదు. రూ. 2,190 కోట్ల సహాయాన్ని రైతులకు అందించే కార్యక్రమం మీరు చేపట్టినందుకు రైతాంగం తరపున మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్‌. 


*ఎం.విశ్వేశ్వర రావు, గిరిజన రైతు, తడిగిరి గ్రామం, హుకుంపేట మండలం,  విశాఖపట్టణం జిల్లా*


సార్‌ నేను గిరిజన రైతును, మీరు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చిన వెంటనే మా అకౌంట్లలో రూ. 13,500 వైఎస్సార్‌ రైతు భరోసా మూడు దఫాలుగా అందింది, చాలా అనందంగా ఉన్నాం సార్, గతంలో స్వర్గీయ డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హయాంలో కొంతమందికి ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాలు ఇచ్చారు, ఆ తర్వాత మీ ప్రభుత్వంలో ఇచ్చారు. గతంలో మేం పోడు వ్యవసాయం చేసేవాళ్ళం, అప్పుడు గత ప్రభుత్వాలు పంటలు వేయకూడదని అడ్డుకునేవారు, కానీ ఇప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన తర్వాత సంతోషంగా పంటలు సాగుచేసుకుంటున్నాం, మేం కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నాం, మా గిరిజనులకు మీరు అండగా ఉన్నారు, మా గిరిజన రైతులంతా మీకు రుణపడి ఉంటాం సార్, రైతు భరోసా కేంద్రాల ద్వారా మాకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి, అలాగే పురుగుమందులు కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారు. అంతేకాదు అగ్రి అడ్వైజరీ బోర్డు సమావేశాలు ప్రతీ నెల మొదటి శుక్రవారం ఏర్పాటుచేసి మా ప్రాంతంలో ఏ పంటలు పండిస్తున్నామో, ఏ పంటలు అనుకూలమో చెప్పి సాగు చేయిస్తున్నారు. ఆర్‌బీకే సిబ్బంది కూడా నేరుగా పొలానికే వచ్చి అన్ని నేర్పుతున్నారు, పంట నష్టపోయిన వెంటనే ఇన్సూరెన్స్‌ అందుతుంది, చిన్న, సన్నకారు రైతులను మీరు ప్రోత్సహిస్తున్నారు. మా పాపకు అమ్మ ఒడి వచ్చింది, మా అమ్మకు ఫించన్‌ కూడా వస్తుంది. మీరు ఎల్లవేళలా ముఖ్యమంత్రిగా ఉండాలని మా గిరిజనులంతా కోరుకుంటున్నారు, వారంతా మీవెంటే ఉంటారు సార్, ధన్యవాదాలు


*కొండే లాజరస్, పెదపాడు మండలం, పశ్చిమగోదావరి జిల్లా*


సార్‌ మీరు పాదయాత్రలో ఇచ్చిన వాగ్ధానం రైతు భరోసా, మా హృదయాలలో గట్టి నమ్మకం ఏర్పడింది. గతంలో జులై నెలలో ఆకుమడులు పోసుకునేవారిమి, డబ్బులేక ఆగష్టు నెలాఖరున ఆకుమడులు పోయడం వల్ల తీవ్రమైన నష్టం వచ్చింది. పంటలు పండించలేక, పిల్లలను చదివించలేకపోయాం. మాకు రైతు భరోసా వల్ల సకాలంలో పంటలు పండించుకుని అధిక లాభాలతో ఉన్నాం, ఈ రోజున మా కుటుంబాలు బావున్నాయి అంటే మీరే కారణం, అందరికీ మంచి చదువులు అందుతున్నాయి. మా పిల్లలను, మా తమ్ముడి పిల్లలు ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు. మీరు రైతాంగానికి వెన్నెముకలా ఉన్నారు. అగ్రికల్చర్‌ అధికారులు కూడా మా దగ్గరకు వచ్చి పంటల గురించి వివరాలు చెబుతున్నారు. గతంలో చిన్న,సన్నకారు రైతులు బాగా ఇబ్బంది పడేవారు. మన ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నారు. ఆక్వా, మొక్కజొన్న, పామాయిల్‌ రైతులు కూడా ఆనందంగా ఉన్నారు. కరెంట్‌ బిల్లులు కట్టలేని సమయంలో నాన్నగారు, మీరు చేసిన సాయం మరువలేం. ఆర్‌బీకేల ద్వారా మంచి సూచనలు, సలహాలు అందుతున్నాయి. గతంలో ఎరువుల కోసం తిరగాల్సి వచ్చేది కానీ ఇప్పుడు అన్నీ కూడా మా గ్రామంలోనే అందుతున్నాయి. మా అమ్మకు క్యాన్సర్‌ వస్తే ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందాం. నేను నాన్నగారి పాదయాత్రలో పాల్గొన్నాను, మీ పాదయాత్రలో కూడా పాల్గొన్నాను. వివిధ పథకాల ద్వారా మా కుటుంబం లబ్దిపొందింది. మీరే మా ఇంటి పెద్ద దిక్కులా మా పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నారు. మా క్షేమం కోసం ఇంత చేస్తున్న మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను సార్, ధ్యాంక్యూ


*పులిపాటి పద్మ, పోట్లూరు గ్రామం, గుడ్లూరు మండలం, ప్రకాశం జిల్లా*


అన్నా నేను ఎస్‌సీ కులానికి చెందిన పేద కౌలు రైతును, గత 10 ఏళ్ళుగా కౌలు రైతుగా జీవనం సాగిస్తున్నాను. నేను వరి, పత్తి, మినుము సాగు చేస్తున్నాను. మీరు గతంలో ఎన్నడూ చేయనివిధంగా కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ డబ్బును నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేయడానికి వాడుతున్నాను. మా సొంత అన్నదమ్ములు కూడా చేయని విధంగా మీరు సాయం చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌ ఆసరా క్రింద డబ్బు అందింది, సున్నా వడ్డీ అందింది. ప్రతీ మహిళ నోటా ఇదే మాట వింటున్నాను. ఆర్‌బీకేల ద్వారా అన్ని సూచనలు, సలహాలు ఇస్తున్నారు. నేను ఇతర రైతులను కూడా ప్రోత్సహిస్తున్నాను. నేను సాధారణ రైతుల మాదిరి కౌలు రైతునైనా ఇ–క్రాప్‌ నమోదు చేయించుకుని పంట బీమా పొందాను. గతంలో దళారులకు పంట అమ్మి నష్టపోయాను, కానీ ఈ సారి మంచి రేట్‌తో అమ్ముకున్నాను. మీరు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది మీ గురించి, మీ అమ్మ గారి గురించి నానా రకాలుగా దూషిస్తున్నారు. కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని అంటారు కదా అలాగే. అన్నా మీకు మేమున్నాం, నా బిడ్డల తరానికి కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్పూర్తిగా దేవున్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నా


*శ్రీదేవమ్మ, లక్ష్మిదేవిపురం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా*


జగనన్నా రైతు భరోసా ద్వారా మీరు రైతుల కళ్ళలో ఆనందం నింపారు. నేను రైతు భరోసాతో పాటు ఆర్‌బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అందుతున్నాయి. గతంలో కర్నూలు వెళ్ళి ఎక్కువ రేట్‌ పెట్టి కొనాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు గ్రామాలలోనే అన్నీ అందుతున్నాయి. ఇ–క్రాప్‌ బుకింగ్‌ ద్వారా నష్టపరిహారం అందింది. నేను సాధారణ పొదుపు మహిళను, మీరు అక్కచెల్లెమ్మలకు మాఫీ చేస్తానని హమీ ఇచ్చినట్లుగా మా బకాయిలు మాఫీ చేశారు. మా పంటలు కూడా ఇ–క్రాప్‌ చేయడం వల్ల అన్నీ అందుతున్నాయి. నా కూతురు ఎం ఫార్మసీ చేస్తుంది, ఫీజులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. నాకు ఆసరా డబ్బు అందింది, లక్ష రూపాయలు వడ్డీ లేని రుణం తీసుకున్నాను. మీ పథకాలు అన్నీ అందుతున్నాయి, ఇంత చేసిన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. మీరే మా ముఖ్యమంత్రిగా ఎల్లవేళళా కొనసాగాలని ఆశిస్తున్నాను సార్‌.